ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకను తమ ఆర్థిక స్థితికి తగ్గట్లుగా వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇక నేటి తరం యువత పెళ్లిలో గతానికి భిన్నంగా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకోవడం కోసం వధువు కావాలంటూ ఓ కుర్రాడు ఊరంతా పోస్టర్లు అంటించాడు.ఈ పోస్టర్లు చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. న గురించి ఇతరులకు అడగకుండా నేరుగా తననే కలవాలని ఆ వాల్ పోస్టర్లో రాసుకున్నాడు.అసలు ఆ యువకుడు ఎవరు.? ఎందుకు అలా వాల్ పోస్టర్ రాశాడో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బాపట్ల జిల్లా వేటపాలెం లోని రామన్నపేటకు చెందిన అయ్యప్ప కుమార్ (28)కు తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. కరోనాకు ముందు హైదరాబాదులో ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కరోనా తర్వాత ఉద్యోగం మానేసి బాపట్ల వచ్చేసాడు. అప్పటి నుంచి తనకు పెళ్లి చెయ్యమని అమ్మమ్మను వేధించేవాడు. అయితే ఉద్యోగం లేకుండా పెళ్లి చెయ్యను అని తన అమ్మమ్మ మందలించేసరికి ఆలోచించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అయ్యప్ప.

తన పెళ్లి తానే సెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వాల్ పోస్టర్ తయారు చేశాడు. అందులో నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఎటువంటి ఫోన్లు, మెసేజ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని మా ఇంటికి వచ్చి ధైర్యంగా నన్ను కలవగలరు. మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకుండా నేరుగా నాతో మాట్లాడండి.నా పేరు దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్, నా వయసు 28 సంవత్సరాలు, చదువు.. డిగ్రీ బీకాం అని రాసుకున్నాడు.

ఈ పాంప్లెట్లను వేటపాలెంలోని అన్ని ప్రధాన సెంటర్లలో అంటించాడు. దీంతో ఈ వాల్ పోస్టర్ చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అయ్యప్ప ఇంటికి వచ్చి అతని అమ్మమ్మను విచారించారు. అయ్యప్పకు ఉద్యోగం లేని కారణంగా మానసిక స్థితి నిలకడగా లేదని అతని అమ్మమ్మ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పోలీసులు అయ్యప్ప కుమార్ కోసం గాలిస్తున్నారు.












సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్‌లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
ఇప్పటిదాకా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ట్రైన్ ను ఢీకొడితే, అది వెళ్ళి గూడ్స్ ఢీకొట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే అది నిజం కాదని తేలింది. జరిగిన యాక్సిడెంట్ కు సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూరే కారణం. వేగంగా వస్తున్న కోరమాండల్ ట్రైన్ కి దారి ఇవ్వడం కోసం ఆ ట్రాక్ పైన ఉన్న గూుడ్స్ ని రైల్వే అధికారులు లూప్ లోకి పంపారు. అయితే 110కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ ట్రైన్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాన తరువాత సిగ్నలింగ్ లోపం వల్ల గూడ్స్ ఉన్న లూప్ లైన్లో కి వెళ్లింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
కోరమాండల్ ట్రైన్ గూడ్స్ ని ఢీకొని 16 నిముషాలు అయినా అటువైపు వస్తుున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను మరో స్టేషన్ లో ఆపలేదు. శుక్రవారం నాడు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘోరప్రమాదానికి కారణం సిగ్నల్ మరియు టెలి కమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరిగిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్‌కాస్ట్‌లు వంటి ఇతర కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.



వికారం, ఉబ్బరం, అజీర్తి, డయేరియా, వాంతులు, కడుపునొప్పి, స్కిన్ రాషెస్, ఆకలి లేకపోవడం


గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌లో నివసిస్తున్న హీరాబెన్ తన ముగ్గురు కుమార్తెలతో పాటు జీవించేది. తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకునేది. ఆమెకు బీపీ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చి కన్ను మూసింది. దాంతో ఆ ముగ్గురు సోదరీమణులు తల్లి లేని వారు అయ్యారు. తల్లి మరణించిన 6 నెలల వరకు ఆమె ఆలోచనలతోనే గడిపారు. అప్పుడు వారికి తల్లి తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆమె విగ్రహాన్ని అయితే తీసుకురావచ్చని, 6 అడుగుల ఎత్తైన తల్లి విగ్రహాన్ని తేరు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
హీరాబెన్ తన జీవితాంతం వరకు తన కుమార్తెలకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంది. తమ తల్లి విగ్రహానికి రోజూ హారతి ఇస్తారు. తమ కళ్ళ ముందు అమ్మ ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరీమణులు తమ తల్లి లేదని బాధపడటం లేదు. విగ్రహంలోనే తమ తల్లిని చూసుకుంటున్నారు.
రోజూ విగ్రహాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ తల్లి లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఈ అక్కచెల్లెల్లు. అలాగే ఆమె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించి, దాని ద్వారా పలువురికి సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం, చదువు లేనిపిల్లలకు వారి చదువు కోసం సహాయం చేస్తున్నారు.




