ఇండియాలో ప్రతినెల మొదటి రోజు అనగా ఒకటవ తేదీన ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. అలాగే వచ్చే అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి అనేక మార్పులు జరగబోతున్నాయి. దానికి కారణం కొత్త ఆర్థిక ఏడాది ఈ రోజు నుంచే మొదలవుతుంది.
2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త రూల్స్, అలాగే వస్తువుల ధరలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గితే, మారికొన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. పాన్-ఆధార్ లింక్ మరియు ఆదాయపు పన్ను రూల్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి అనేక అంశాలలో మార్పులు జరగనున్నాయి.
కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు పెరిగే వస్తువుల జాబితాలో హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్స్, దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి ఉన్నాయి. అలాగే వీటితో పాటు ప్లాటినం ధరలు, వెండి వస్తువుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, ఇమిటేషన్ ఆభరణాలు, సిగరెట్ల ధరలు ఏప్రిల్ నెల నుండి పెరగనున్నాయి.
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే జాబితాలో వజ్రాలు, రంగు రాళ్లు, దుస్తులు, సైకిళ్లు, బొమ్మలు, టీవీల ధరలు తగ్గబోతున్నాయి. ఇక వీటితో పాటుగా కాఫీ గింజలు, ఇంగువ, శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు రేట్లు తగ్గనున్నాయి. ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రానిక్ వెహికిల్స్ తో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు కావలసిన కొన్ని రకాల కెమికల్స్, లిథియం అయాన్ బ్యాటరీల రేట్లు తగ్గనున్నాయి.
Also Read: వీరు పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయనవసరం లేదు..













అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: 
















డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్‌టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: 


