ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దాంతో ఆంధ్రా నాయకులు అందరూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి ఊరికి వెళ్లి, ఎన్నికల ప్రచారం కోసం సభలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, అందులో పాల్గొని, ప్రజలని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా సిద్ధం సభలో పాల్గొన్నారు. ఇవాళ సభలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. విజయవాడలో ఇవాళ సిద్ధం సభని నిర్వహించారు. ఎన్నో వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అక్కడ జగన్ బస్సు మీద నిల్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు జగన్ మీదకి కొంత మంది పూలు విసిరారు. ఆ పూలతో పాటు ఒక రాయిని విసిరారు. ఆ రాయి జగన్ కంటి పై భాగానికి తగిలింది. ఎడమ కంటిపై ఈ రాయి తగిలింది. జగన్ కి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం మీద దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి ఎవరు చేశారు అనే విషయం ఇంకా తెలియలేదు. దెబ్బ తగిలినా కూడా జగన్మోహన్ రెడ్డి తన యాత్రని కొనసాగిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ తీసుకొని మళ్ళీ తిరిగి యాత్రను ప్రారంభించారు. మామూలుగానే తన ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్ధం సభలోనే ఉన్నారు. కానీ తర్వాత ప్రచార కార్యక్రమాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా ముందు అనుకున్న టైమ్ టేబుల్ ప్రకారమే కొనసాగుతాయా అనే విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి వైద్యం తీసుకొని తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
watch video :
Andhra Pradesh CM #JaganMohanReddy was injured by a stone thrown by unknown individuals during his '#MemanthaSiddham' bus tour in Vijayawada.
He sustained an injury near his eyebrow. Immediate first aid was given, allowing CM Jagan to continue his journey.#AndhraPolitics pic.twitter.com/1YYlmgSKCH
— Informed Alerts (@InformedAlerts) April 13, 2024