సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండని నాగ చైతన్య సడెన్ గా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా చైతూ తన తల్లిదండ్రులకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం “థాంక్యూ”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు -శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22 న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్లలో వేగం పెంచారు చిత్ర బృందం.
ఇప్పటికే ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న చైతన్య తాజాగా ‘థాంక్యూ’ పేరుతో తమకు కష్టాల్లో సాయం చేసిన వారికి థాంక్యూ చెప్పమని #themagicwordisthankyou పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులకు షేర్ చేశాడు. మొదటగా తానే తన జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు థాంక్స్ చెప్పాడు చైతూ.
అమ్మ లక్ష్మి ఫోటోను షేర్ చేస్తూ.. “అమ్మ – నా అంతరంగికంగా, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు నిర్మించుకుంటూ నాలో పాతుకుపోయినందుకు, అన్ని విధాలుగా నీకు థాంక్స్..”. అంటూ చైతన్య పోస్టు చేసాడు. తండ్రి నాగార్జున ఫోటో షేర్ చేస్తూ “నాన్న – నాకు దిశానిర్దేశం చేసినందుకు మరియు మరెవ్వరూ చేయలేని స్నేహాన్ని పంచి నా స్నేహితుడిగా ఉన్నందుకు నీకు థాంక్స్”.. “హ్యాష్ (కుక్క పేరు) – ఒక మనిషిగా నన్ను నేను ఎలా ప్రేమించాలో చూపించినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు.