మార్చి మొదటి వారంలో అయిన అంబానీ కుటుంబంలో జరిగిన వేడుకల గురించి ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. గుజరాత్ లోని జాంనగర్ లో ఈ వేడుక జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో దాదాపు 2000 పైగా వంటలని వడ్డించారు.
అంతే కాకుండా, ఒకసారి పెట్టిన వంటని మరొక సారి రిపీట్ చేయకుండా ఈ వంటకాలు ఉన్నాయి. అంటే అన్ని వెరైటీలు ఉన్నాయి. అంబానీ కుటుంబం అంతా కూడా డిజైనర్ దుస్తులు వేసుకున్నారు. వీటి ధర కూడా దాదాపు కోట్లల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా అంబానీ కుటుంబం కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు. బంగారు పోగులతో చాలా దుస్తులు తయారు చేశారు.

అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే రాధిక మర్చంట్ కూడా ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. వీటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఉన్న దుస్తులు వీరు ధరించారు. కొన్ని అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్స్ తయారు చేస్తే, కొన్ని ఇండియన్ బ్రాండ్స్ ద్వారా రూపొందించబడ్డాయి. ఈ వేడుకల్లో రాధిక చెప్పిన స్పీచ్ కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది. అంతే కాకుండా రాధిక అన్నదాన కార్యక్రమంలో మాట్లాడిన విధానం కూడా చాలా మందికి నచ్చింది.

అన్ని కోట్ల సామ్రాజ్యానికి వారసురాలు అయినా కూడా, ఇన్ని కోట్లు ఆస్తులు ఉన్న కుటుంబానికి కోడలుగా వెళ్తున్నా కూడా రాధికకి కొంచెం కూడా గర్వం లేదు. అందరితో చాలా బాగా మాట్లాడారు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఇదే అంటున్నారు. రాధిక అనంత్ తో గత ఏడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. రాధిక కూడా వ్యాపార కుటుంబం నుండి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా? రాధిక కుటుంబం సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు 755 కోట్ల రూపాయలు ఉంటుంది అని సమాచారం.

వ్యాపార రంగంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న కారణంగా వీరు కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. అయితే మరొక పక్క అంబానీ ఆస్తుల విలువ 7.65 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. పోల్చి చూస్తే, అనంత్ అంబానీకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా వీరిద్దరూ చిన్నప్పటినుండి స్నేహితులు, ఒకరికి ఒకరు బాగా తెలుసు. ప్రేమ అన్నాక ఆస్తులు, అంతస్తులు కూడా చూడరు. వీరిద్దరూ ఒకరికి ఒకరు అంటే ఎంత ఇష్టం అనేది వీరి మాటల్లోనే అర్థం అవుతోంది. అనంత్ అంబానీ కూడా రాధిక గురించి ఈ వేడుకల్లో చాలా గొప్పగా చెప్పారు.
ALSO READ : పెళ్లి కార్డులో ఇలాంటి వివరాలు కూడా పెడతారా..? ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!





















స్త్రీలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి, శ్మశాన వాటికకు వెళ్ళకుండా నిషేధించడం చాలామంది పురాణాల ఆధారంగా అధ్యయనం చేశారు. మహాభారత కాలంలో స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనేవారని తెలుస్తోంది. భీష్ముడి దహన సంస్కారాల సమయంలో కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొన్నట్లు కనుగొన్నారు. పూర్వ కాలంలో మరణానికి, స్వర్గానికి కుమారుడు వారధి అని భావించేవారు. మరణించినవారికి అంత్యక్రియలు మరియు చితికి నిప్పు పెట్టడం వంటి ప్రక్రియ కుమారుడు చేస్తే ఆ వ్యక్తులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసించేవారు.
అందువల్ల కుమారుడు లేదంటే కుమారుడితో సమానమైనవారితో దహన సంస్కారాలు చేయించేవారు. పూర్వ కాలంలో స్త్రీలు చాలా సున్నితమైన వారు అని, త్వరగా భావోద్వేగానికి లోనవుతారని అనుకునేవాళ్ళు. అందువల్ల దహన సంస్కారాలను స్త్రీలు చూసి తట్టుకోలేరని, వాళ్లను అంత్యక్రియలకు దూరంగా ఉంచేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలను స్మశాన వాటికకి రాకూడదు అనడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే,
పూర్వకాలంలో అంత్యక్రియలు చేసేటపుడు, ఇంట్లో ఉండే వృద్దులను, పిల్లలను చూడడం కోసం. వచ్చినవారందరికి భోజన ఏర్పాట్లు చేయడం కోసం స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. పురుషులు మాత్రమే స్మశానంకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఇక అంత్యక్రియలు చేసేటపుడు స్మశానంలో దుష్టశక్తులు కూడా ఉంటాయట. స్త్రీలు సున్నితంగా ఉండడం వల్ల వాళ్లను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉందని, మహిళలను స్మశాన వాటికలోకి నిషేధించారట. దహన సంస్కారాలకు వెళ్ళిన స్త్రీలు తమ వెంట్రుకలను తీసివేయాలట. ఆ కారణంగా కూడా స్త్రీలను నిషేధించారని తెలుస్తోంది.


