పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రమోషన్ లేదా వీకెండ్ లాంటి కారణం ఏదైనా ఫ్యామిలితో లేదా ఫ్రెండ్స్ తో రెస్టారెంటుకి వెళ్ళడం ఈ రోజుల్లో సాధారణం అయ్యింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్న తరువాత, వచ్చిన బిల్లును చూస్తే ఆ సరదా కాస్తా తీరిపోతుంది.
వందల్లో వచ్చిన బిల్లును చూస్తే, దాని పైన రకరకాల పేర్లతో ఉండే అదనపు చార్జీలు కూడా చెల్లించేసి బయటకి వస్తాం. అయితే ఇటీవల కాలంలో కొన్ని రెస్టారెంట్స్ లో జీఎస్టి పేరుతో మోసం జరుగుతోందని తెలుస్తోంది. దానిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
రెస్టారెంట్లలో జీఎస్టి అమలులోకి వచ్చిన అనంతరం, రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్ల దగ్గర జీఎస్టి పేరుతో ఎక్కువగా వసూలు చేస్తున్నారనే విషయం తెలిసొందే. చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో ఫుడ్ తిన్నాకూడా కనీసం 18 శాతం జీఎస్టి కట్టాల్సి వస్తోంది. దీనికి తోడు సర్వీస్ చార్జి మరో పది శాతం. చాలా హోటళ్లు జీఎస్టి లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి.
అయితే కొన్ని రెస్టారెంట్స్ కంపోజిషన్ ట్యాక్స్‌పేయర్ గా ఉన్నప్పటికీ కూడా బిల్ లో జీఎస్టిని కూడా కలిపి, కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఈ టాక్స్ పేయర్స్ గా ఉన్న రెస్టారెంట్స్ లో జీఎస్టి కట్టాల్సిన అవసరం లేదు. మరి కంపోజిషన్ ట్యాక్స్‌పేయర్ అవునో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది.
బిల్లు పై ఉన్న GST చెల్లించాలా వద్దా అని ఎలా చెక్ చేయాలంటే..?
- జీఎస్టీ పోర్టల్ https://www.gst.gov.in కి వెళ్ళాలి.
- సెర్చ్ ట్యాక్స్ పేయర్ మరియు సెర్చ్ కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ పై ట్యాప్ చేయాలి.
- ఆ తరువాత రెస్టారెంట్ బిల్లు పై ఉన్న జీఎస్టీ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ రెస్టారెంట్ సాధారణ జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ కిందకు వస్తుందా లేదా కాంపోజిట్ ట్యాక్స్‌పేయరా అనేది కస్టమర్‌కు తెలుస్తుంది.
- ఇది కాంపోజిట్ ట్యాక్స్‌పేయర్ అయితే బిల్లుపై విధించిన జీఎస్టీని చెల్లించకూడదు.
- ఒకవేళ హోటల్
- సాధారణ జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ క్రింద ఉన్నట్లయితే, జీఎస్టీ మొత్తాన్ని చెల్లించాలి.
https://www.instagram.com/reel/CvXRaltg19G/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: కోచింగ్ లేకుండా IAS..! ఇది ఎలా సాధ్యం..?