మనిషిని జంతువులను వేరే చేసేవి భావోద్వేగాలే. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి. కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, నిరాశ వంటివన్నీ భావోద్వేగాలు. ఇవి కేవలం మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంటాయి.
అయితే కొన్ని పదాలు యాసిడ్ లా పనిచేస్తాయి. కొన్ని రిలేషన్ ని నాశనం చేస్తాయి. కాబట్టి ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ కోపం గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాటలు ఉపయోగించుకోవాలి. లేషన్ లో చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు.. వచ్చే మాటల విషయంలో చాలా కేర్ లెస్ గా ఉంటారు. ఆ అలవాటు.. మీ రిలేషన్ ని నాశనం చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఆడవారు కోపం లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అని కోరా లో ఒక ప్రశ్న వచ్చింది. దానికి హరిత అనే యూజర్ ఇలా సమాధానం ఇచ్చారు.
#1 “ఇప్పుడు ఏమైందని అంత రాద్దాంతం. ఇంత చిన్న విషయానికి…!!”
కోపం లో ఉన్న ఆమెతో ఈ మాట అంటే చాలు.. ఆ కోపం తారాస్థాయికి చేరుకుంటుంది.. ఎందుకంటే చూసే వారికి చిన్న విషయం అనిపించొచ్చు కానీ ఆమెకు అదే పెద్ద సమస్యలా ఉండొచ్చు.
#2 “ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూడటం అలవాటు అయిపోయింది నీకు..”
చిన్న విషయాలని చిన్నదిగానే భావించి సర్దుకుపోవడం ఆడవాళ్ళ నైజం…కాబట్టి ఒక అమ్మాయికి కనుక కోపం వచ్చింది అంటే అది ఖచ్చితంగా పెద్ద విషయమే. అలాగే అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు.. లక్షల ఆలోచనలు వాళ్ల మైండ్ లో మెదులుతాయి. కాబట్టి.. మీ పదాలు.. మీ మాటలు మరింత ఇబ్బందిపెడతాయి.
ఈ విషయాలు పక్కన పెడితే ఒక వేళ మీ భార్య లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కోపం గా ఉన్నప్పుడు తప్పు మీ వైపు ఉంటే క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పడం వల్ల మీ విలువ ఏమీ తగ్గదు. తప్పు మీదైతే క్షమాపణ అడగడం ద్వారా మీ బంధం బలోపేతం అవుతుంది. అలాగే ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించండి. కోపం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అసలు సమస్య ఏమిటి, ఎందుకలా కోపగించుకుంటుంది ఆమె చెప్పడానికి ప్రయత్నించినప్పుడు చెప్పనివ్వాలి. అప్పుడే సమస్యని పరిష్కరించగలం.