జార్ఖండ్ లో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న హేమంత్ సోరేన్ మనీ ల్యాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసు విషయంలో ఒకవేళ ముఖ్యమంత్రి హేమంత్ రాజీనామా చేస్తే ఝార్ఖండ్ కి తదుపరి ముఖ్యమంత్రి ఏది ఎవరు అంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఒకరి పేరు తెరపైకి వచ్చింది.

అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద హేమంత్ సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో డిసెంబర్ 30న ఈడీ ఆయనకు సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు అందుబాటులో ఉండే సమయం చెప్పాలని ఈడీ ఆయనను కోరింది. ఈ కేసులో ఈడీ ఆయనకు ఇప్పటికీ ఏడు సార్లు సమాన్లు పంపింది. అయితే ఇంతవరకూ ఆయన ఈడీ ముందు హాజరుకాలేదు.
ఆగస్టు 14న ఈడీ తొలి నోటీసు ఇవ్వగా ఈడీ చర్యల నుంచి ప్రొటక్షన్ కోరుతూ సుప్రీంకోర్టు ముందు, ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టు ముందు ఆయన పిటిషన్ వేశారు. అయితే ఆయన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తప్పుడు అభియోగాలు, ఉద్దేశాలతో తనకు సమన్లు పంపారని, జార్ఖండ్‌లో అనిశ్చితి సృష్టించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని సోరెన్ అంటున్నారు. ఈ కేసులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా గతంలో పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావి రంజన్‌తో సహా 14 మందిని ఈడీ అరెస్టు చేసింది.

అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేస్తే నెక్స్ట్ సీఎం గా హేమంత్ భార్య కల్పన సోరేన్ ను కూర్చోబెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని బిజెపి ఎంపీ నిషికాంత్ దొబే సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం పైన ఆయన ఒక ట్విట్ చేశారు.జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారని, దానిని సీఎం ఆమోదించారని తెలిపారు. సోరెన్ సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని, ఆయన భార్య కల్పన సోరెన్ జార్ఖండ్ తదుపరి సీఎం కానున్నారని అందులో పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్‌పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.













