తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.
ఒకసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మాధవి. యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది. టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు.

2018లో హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బిటెక్ పూర్తి చేశారు. తర్వాత 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.

యశస్విని రెడ్డి భర్త అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. యశస్విని రెడ్డి మామయ్య కార్డియాలజిస్ట్. యశస్విని రెడ్డి అత్తమామలు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు. వారికి 1000 యూనిట్స్ ఉన్నాయి. అవి బయట వేరే మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వకుండా వీళ్లే మేనేజ్ చేసుకుని, లీజింగ్ ఆఫీస్ కూడా వీళ్లే చూసుకుంటారు. అది కాకుండా బాదం, పిస్తా తోటలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఆఫీస్ లు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఈ పనులన్నీ యశస్విని రెడ్డి భర్త చూసుకుంటారు.

ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు. బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంత కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. యశస్వి రెడ్డి కూడా అమెరికాలో కంపెనీ వ్యవహారాలు చూసుకుని వారు. తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఎస్ఎస్సి రెడ్డికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకి నెగిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు.

విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్‌గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.