తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు… మార్పులు చేర్పులు కూడా…!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు… మార్పులు చేర్పులు కూడా…!

by Mounika Singaluri

Ads

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సంస్కరణలు తీసుకువస్తూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే ఇప్పుడు రేషన్ అందుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కొత్త రేషన్ కార్డులు జారీ తో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనుంది….!

Video Advertisement

ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు. అర్హుల ఎంపిక క్షేత్ర స్థాయిలోనే జరిగే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

అర్హులైన వారికి కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు.దీంతో ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ -సేవ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తాజాగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ 10 లక్షలకు పెంచింది. రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్య శ్రీ అమలు కానుంది. దీంతో రేషన్ కార్డు కోసం మరింత అవసరం ఏర్పడింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతీ ఒక్కరికీ ఆరు కేజీల బియ్యం అందుతాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో గోధుమలు కూడా ఇస్తున్నారు.అయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలని పిల్లల పేర్లు చేర్చాలని ఇప్పటికే ఎన్నో వినతులు వచ్చాయి. వాటిపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది


End of Article

You may also like