వైయస్ షర్మిల రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ శాతం రాజకీయాలకి తన జీవితాన్ని కేటాయించిన షర్మిల తన కుటుంబ సభ్యుల గురించి బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి. ఇక షర్మిల కు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు కుమార్తె…కొడుకు పేరు రాజారెడ్డి, కుమార్తె పేరు అంజలి రెడ్డి.
తాజాగా షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమ పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే రాజారెడ్డి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రాజారెడ్డి ఎక్కడుంటాడు ఏం చదువుకున్నాడు అనే విషయాలు ఎవరికి తెలియదు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం…

షర్మిల కొడుకు రాజారెడ్డి అమెరికాలో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రెడిక్టివ్ ఎనలైటిక్స్ లో ఎంఎస్సీ చేశారు. ఎంఎస్సి పట్టా పొందే సమయంలో షర్మిల అలాగే వైయస్ విజయమ్మ ఇద్దరు కలిసి అమెరికాకు వెళ్లడం రాజారెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షర్మిల కొడుకు రాజకీయాలు వైపు రాకుండా చదువుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత కూడా పూర్తిగా అమెరికాలోని సెటిల్ అవుతాడని వైఎస్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.















