కొన్నాళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఈ జట్టు సెమీస్ లో వెనుదిరిగింది. ఇందుకు కారణం అతనే అంటూ ఒక ప్లేయర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆటగాడు మరెవరో కాదు. పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ. కానీ తన మీద వచ్చిన ఆ నెగెటివ్ కామెంట్స్ అన్నిటికీ హసన్ అలీ సమాధానం చెప్పాడు.
శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో హసన్ అలీ మూడు కీలక వికెట్లు పడగొట్టారు. ఇందులో మాన్ అఫ్ ది మ్యాచ్ లో కూడా నిలిచారు.
అయితే, ఇందులో రెండవ ఓవర్లో హసన్ అలీ వేసిన బంతి ఏకంగా 219 కిలోమీటర్ల వేగం నమోదు చేసింది. ఇంగ్లాండ్ పై షోయబ్ అక్తర్ వేసిన బంతి 161.13 కి నమోదు చేయగా, ఇప్పుడు హసన్ అలీ దాదాపు 60 కి.మీ ఎక్కువ వేగంతో బంతి విసిరారు. దాంతో షోయబ్ అక్తర్ రికార్డ్ బద్దలు కొట్టారు. కానీ కానీ ఇక్కడ స్పీడోమీటర్ తప్పిదం వల్ల హసన్ అలీ వేసిన బంతి వేగం అంత ఎక్కువగా చూపించింది. నిజానికి హసన్ అలీ వేసిన బంతి అంత దూరం వెళ్లలేదు. కానీ స్పీడోమీటర్ అలా చూపించగానే ప్లేయర్లు షాక్ అయ్యారు. అది చూసిన నెటిజన్లు కూడా దీనిపై ట్రోల్ చేస్తున్నారు.
watch video :
@RealHa55an breaks @shoaib100mph record by bowling a 219kph delivery 😂@BCBtigers what's up with that ball speed radar.
Congratulations @TheRealPCBMedia@TheRealPCB#BANvPAK pic.twitter.com/9pdUHGkcBz
— Vitamin Protein (@JSMubi) November 19, 2021