2019లో ఇంగ్లాండ్‌పై వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.
మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో మొయిన్ అలీ (51 నాటౌట్: 37 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ మలాన్ (41: 30 బంతుల్లో 4×4, 1×6) విలువైన పరుగులు అందించారు.
#1
#2
#3
#4
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ ఒక వికెట్, ఆడమ్ మిల్నె ఒక వికెట్, ఇస్ సోధి ఒక వికెట్, నీషమ్ ఒక వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 166 పరుగుల స్కోర్ చేసింది.
#5#6
#7
#8
తర్వాత 167 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ మిచెల్ (72 నాటౌట్: 47 బంతుల్లో 4×4, 4×6), దూకుడుగా ఆడటంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 167/5 తో విజయాన్ని సొంతం చేసుకుంది.
#9#10
స్లాగ్ ఓవర్లలో నీషమ్ (27: 11 బంతుల్లో 1×4, 3×6) హిట్టింగ్, మిచెల్ పనిని మరింత సులభం చేసింది.
#11#12
ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#13
#14
#15
#16