కొత్త ఇండియా టీమ్ జెర్సీపై ఈ స్టార్స్ గమనించారా.? ఇంతకముందు మూడు ఉండేవి…ఇప్పుడు ఒకటే ఎందుకు.?

కొత్త ఇండియా టీమ్ జెర్సీపై ఈ స్టార్స్ గమనించారా.? ఇంతకముందు మూడు ఉండేవి…ఇప్పుడు ఒకటే ఎందుకు.?

by Mohana Priya

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.

Video Advertisement

why does bcci logo have three stars

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), భారతదేశంలో క్రికెట్ అభివృద్ధి చేయడానికి ఒక జాతీయ పాలక సంస్థ. ఇది డిసెంబర్ 1928లో తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద ఒక సొసైటీగా స్థాపించబడింది. BCCI లోగో, బ్రిటిష్ రాజుల కొలనల్ పిరియడ్ లోని “ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” యొక్క చిహ్నం నుండి రూపొందించబడింది. 1857 యుద్ధ సమయంలోని భారతదేశ రాజకుమారులను, రాజులని గౌరవించడానికి 1861 సంవత్సరంలో క్వీన్ విక్టోరియా “ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” అవార్డుని ప్రవేశపెట్టారు.

ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భారత క్రికెటర్ల కొత్త జెర్సీపై బీసీసీఐ లోగోపైన మూడు స్టార్స్ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే. ఇండియా ప్రపంచ కప్ మూడు సార్లు గెలిచింది. మొదటిది 1983లో, రెండవది 2007లో, మూడవది 2011లో. ఇందుకు చిహ్నంగానే లోగో మీద మూడు స్టార్స్ ఉంటాయి. కానీ 2019లో ఆడిన వరల్డ్ కప్ లో మాత్రం లోగో మీద కేవలం రెండు స్టార్స్ మాత్రమే ఉన్నాయి. అందుకు కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే, 1983 లో, 2011 లో ఆడినవి ODI వరల్డ్ కప్. కానీ 2007లో ఆడింది మాత్రం టి20 వరల్డ్ కప్. ఈ కారణంగానే 2019లో ఆడినప్పుడు 1983, 2011 వరల్డ్ కప్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకే 2019 లో ఆడిన వరల్డ్ కప్ మ్యాచ్ లో కేవలం రెండు స్టార్స్ మాత్రమే ఉంటాయి.


End of Article

You may also like