ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన క్రికెట్ జీవితం గురించి ఒక ఇంటర్వ్యూ లో పలు విశేషాలు పంచుకున్నారు. తాను 2018లో రీ ఎంట్రీ ఇవ్వడం వెనకాల msk ప్రసాద్ పాత్ర ఉందనేది అవాస్తవం అంటు కుండ బద్దలు కొట్టారు.తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ ఉందని క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, తన రీ యంట్రి విషయంలో msk క్లెయిమ్ చేసుకుంటున్నాంటూ సెటైర్లు వేశారు.
ఎమ్మెస్కే ప్రసాద్ తనకైతే ఫోన్ చేయలేదన్న రాయుడు, అలాగని ఆయన అబద్ధం చెప్పారని తాను అనడం లేదన్నారు. అయితే ఆటగాళ్ల ఎంపిక వెనుక ఓ ప్రొసీజర్ ఉంటుందన్నారు.ఫిట్నెస్ సమస్యల కారణంగానే 2019 వరల్డ్ కప్‌కి నేను ఎంపిక కాలేదని msk ప్రసాద్ చెప్పలేదు.

ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు యో-యో టెస్ట్ జరిగింది. రెండు వారాల్లో అది పాసయ్యాను. ఫిట్నెస్ కోసం కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎన్సీఏలో శిక్షణ పొందొచ్చు. దాని కోసం ఎవరూ ప్రత్యేకంగా లెటర్ రాయడం లాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని msk విషయంలో కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రోజుల నుంచి తాను ముందుకెళ్తుంటే చాలా మంది వెనక్కి లాగడానికి ప్రయత్నించారని రాయుడు తెలిపారు.

మా క్రికెట్ భవిష్యత్తుకు సమాధి కట్టాలని నిర్ణయించడంతోనే తాను ఐసీఎల్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. ఐసీఎల్ లేకపోతే నేను ఎప్పుడో క్రికెట్ వదిలేసేవాణ్ని. ఆ లీగ్ ఫ్లాప్ అయినా మా ప్రతిభ బయటకొచ్చింది. హెచ్‌సీఏ మమ్మల్ని తీసేస్తే.. ఐసీఎల్ రూపంలో మాకు ఓ అవకాశం వచ్చింది. ఐసీఎల్ రెండేళ్లపాటు శిక్షణ, మ్యాచ్‌లు మాకెంతో ఉపకరించాయి అని రాయుడు తెలిపారు


భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరియు రోహిత్ శర్మ 2008లో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూట్‌కు యువరాజ్ మేనేజర్ రితికా సజ్దే కూడా వచ్చారు. రీతికను యువరాజ్ సోదరిగా భావిస్తాడు. అందువల్ల రోహిత్ షూట్ కోసం రాగానే రితికను చూపిస్తూ, ఆమె స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ అని, ఆమెకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన రోహిత్ ఆమెతో నాకేం పని? ఇక్కడికి షూటింగ్లో పాల్గొనడానికి వచ్చానని స్ట్రాంగ్ గా చెప్పాడు. అయితే మరోసారి షూట్ లో కలిసినపుడు రితిక ప్రవర్తించిన విధానానికి రోహిత్ ఫ్లాట్ అయ్యాడు.
అలా వారిద్దరి మధ్య మాటలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత రోహిత్ శర్మకు రితిక మేనేజర్ అయ్యింది. ఇలా మొదలైన వారి ప్రయాణం, ప్రేమ, డేటింగ్ వరకు సాగి, పెద్దల అంగీకారంతో 2015లో జూన్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో రోహిత్, రితిక ల ఎంగేజ్మెంట్ జరుగగా, డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లికి ముందు డేటింగ్ చేసిన విషయాన్ని ఇద్దరు చాలా రహస్యంగా ఉంచారు. వీరిద్దరూ తమ వివాహ బంధానికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తమ ప్రేమను తెలుపుతూ సోషల్ మీడియాలో అందమైన ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ జంటకి 2018లో డిసెంబరు 30న కుమార్తె జన్మించింది.
ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024కు ముందు కెప్టెన్ మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్ళ నుండి జట్టును నడిపించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. అత్యంత విజయవంతమైన టీమ్ గా ఐపీఎల్లో కొనసాగుతున్న, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా ముంబయి ఇండియన్స్‌కు చాలా పేరుంది. ఈ జట్టుకు 2013లో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ లో కప్ ను అందించిన రోహిత్, పదేళ్లుగా ఆ జట్టుకు ఎన్నో విజయాలు సాధించాడు.
ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. జట్టు పై కెప్టెన్‌గా, ఫ్యాన్స్ పై తనదైన ముద్రను వేశాడు. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్‌గా లేని ముంబై జట్టును ఊహించుకోవడం ఫ్యాన్స్ మింగుడుపడడం లేదు. అలా చేయడం చాలామందికి షాక్ కి, ఆగ్రహానికి గురి చేసింది. రోహిత్ ను తప్పించడం పై సోషల్ మీడియాలో ముంబై జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పై తాజాగా గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే రెస్పాండ్ అయ్యారు.
2024 సీజన్ నుండి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నట్లు జయవర్ధనే వెల్లడించారు. ‘ఎప్పుడైనా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే జట్టు నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటిదే ఈ డిసిషన్, రోహిత్ మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్, హర్భజన్, పాంటింగ్ లు టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడమే కాకుండా ముందుచూపుతో కూడా నడుచుకున్నారని అన్నారు. ఇక రోహిత్ శర్మ సారధ్యంలో జట్టు అత్యుత్తమ ఫలితాలను అందుకుంది. అతని కెప్టెన్సీకి అభినందనలు. ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన రోహిత్ ఎక్స్పీరియన్స్ టీమ్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అంటూ జయవర్ధనే పేర్కొన్నాడు.
వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే అండర్ – 19 పురుషుల వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బపోటీ పడనుంది. ఈ జట్టుకు అండర్ – 19 ఆసియాకప్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఉదయ్ సహరన్ వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్సీ అప్పజెప్పింది. పదిహేనుమంది ఆటగాళ్లతో కూడిన ఈ టీమ్ లో అండర్ – 19 ఆసియాకప్ ప్లేయర్స్ కే అవకాశం ఇచ్చారు. అర్షిన్ కులకర్ణి, రుద్ర మయూర్ పటేల్, ఆదర్శ సింగ్, సచిన్ దాస్ బ్యాటింగ్ చేయనున్నారు.
ఇక జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అరవెల్లి అవనీష్ రావును వికెట్ కీపర్‌గా సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావు తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా, పోత్గల్ గ్రామానికి చెందిన క్రికెటర్. అతను వెలమ వర్గానికి చెందినవాడు. పోత్గల్, దాని చుట్టుపక్కల గ్రామాలలో అధిక శాతం ఆ వర్గానికి చెందినవారు ఉంటారు. అయితే ఆ వర్గం వారిలో ఎక్కువగా రాజకీయ, లేదా వ్యాపార రంగాల వైపుకు వెళ్తారనే టాక్ ఉంది.
కానీ అవనీష్ రావుకు చిన్నప్పటి నుండి క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. క్రికెట్ లో ప్రతిభ కనపరిచిన అవనీష్ ను అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. సిరిసిల్ల వంటి ప్రాంతం నుంచి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంతో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అవనీష్ తల్లిదండ్రుల పైన నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
1. యశస్వి జైస్వాల్
2. రింకూ సింగ్
3. మహ్మద్ సిరాజ్
4. టి నటరాజన్
5. రవీంద్ర జడేజా:
6. చేతన్ సకారియా:
వివో ఐపీఎల్ 2021 లో చేతన్ తన ఆటతో సంచలనంగా మారాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.2 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో చేతన్ ప్రదర్శనతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు టీ20 జట్టులోకి కూడా ఎంపిక అయ్యాడు. చేతన్ సకారియా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది.
జట్టులో ఓపెనర్ల పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో, అలాగే ఫినీషర్ల పాత్ర కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభంలో ఎంత బాగా ఆడినప్పటికీ, మ్యాచ్ ను విజయవంతంగా ముగించే ఫినిషర్ లేకపోతే అప్పటిదాకా ఎంత స్కోర్ చేసిన వ్యర్థమే అవుతుంది. అలా అని జట్టులో ఫినీషర్లు మాత్రమే ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ధోనీ రిటైర్ అయినప్పటి నుండి భారత జట్టు మంచి ఫినీషర్ కోసం చూస్తోంది. ధోనీ లాగా మ్యాచ్ చివరి వరకు నిలిచి మ్యాచ్ ను గెలిపించగల యువ క్రికెటర్ల పై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ భారత జట్టుకు ఎందరో మంచి ఆటగాళ్లను ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ ద్వారా మంచి ఫినీషర్ లభించినట్టుగా భావిస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా సోమవారం నాడు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పై గెలిచింది.
మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా జట్టు ఆఖరి బంతికి గెలుపును సాధించింది. కెప్టెన్ నితీశ్ రాణా 51 పరుగులు, ఆండ్రీ రసెల్ 42 పరుగులు, రింకు సింగ్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తమ జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఫినీషర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించాడు. కోల్‌కతాకు వరుసగా ఇది రెండవ విజయం. దీనితో పాయింట్ల పట్టికలో 5వ స్ధానానికి కోల్‌కతా జట్టు చేరుకుంది.
రింకూ సింగ్ అంతకముందు మ్యాచ్ లో కూడా కీలక సమయంలో తన జట్టును ఆదుకున్నాడు. 35 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ చివరి ఓవర్. 5 బాల్స్ లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, ప్రతీ బాల్ ని సిక్సర్‌గా మార్చి గుజరాత్ జట్టు పై కోల్‌కతా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా వరుస మ్యాచ్ లలో రింకూ సింగ్ ప్రతిభను చూసినవారు భారత జట్టుకి మరో ధోనీ దొరికేశాడని అభిమానులు సంతోష పడుతున్నారు.