Home Sports Adda సౌత్ ఆఫ్రికా తో మూడో టి20… హైదరాబాదీ ఆటగాడు పై వేటు…!

సౌత్ ఆఫ్రికా తో మూడో టి20… హైదరాబాదీ ఆటగాడు పై వేటు…!

by Sainath Gopi

ప్రస్తుతం ఇండియా సౌతాఫ్రికా t20 సిరీస్ ఆడుతుంది. గురువారం జోహనాస్ బర్గ్ వేదికగా మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మూడో టి20 లో ఎలాగైనా గెలిచి సిరీస్ ని 1-1 తో సమానం చేయాలని భారత్ భావిస్తుంది. అలాగే ఈ మూడో టి20 లో భారత్ ను ఓడించి 2-0 సిరీస్ ని కైవసం చేసుకోవాలని సౌత్ ఆఫ్రికా సన్నహాల్లో ఉంది.

comments on this indian player

 

అయితే ఈ మూడవ టి20 మ్యాచ్ లో టీం మేనేజ్మెంట్ భారీ మార్పులు చేస్తుంది. తుది జట్టులోకి యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో పాటు బౌలర్ రవి బిష్ణోయ్ ను తీసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, కులదీప్ యాదవ్ లను బెంచుకు పరిమితం చేయనుంది. రెండో టి20 లో యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్ నిరాశపరిచినప్పటికీ గిల్ కి మాత్రం మూడో టి20లో చోటు దక్కనుంది.రుతురాజ్ కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు.అయితే తిలక్ వర్మ రెండో టీ20 లో బాగా ఆడినప్పటికీ కూడా కీలకమైన మ్యాచ్ కావడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఆడించనుంది. మరోవైపు ఫేస్ బౌలింగ్ లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

You may also like