టీం ఇండియాకి మరో “ధోనీ” దొరికేసాడా..? ఆ స్థానం ఇతనే భర్తీ చేస్తాడా..?

టీం ఇండియాకి మరో “ధోనీ” దొరికేసాడా..? ఆ స్థానం ఇతనే భర్తీ చేస్తాడా..?

by kavitha

Ads

భారత జట్టుకు మరో ధోని దొరికాడని అంటున్నారు. మ్యాచ్ చివర్లో అద్భుతంగా ఆడి తన టాలెంట్ ను నిరూపించు కుంటున్నాడు. అతడి ఆటను చూస్తుంటే ధోని ఆటను చూసినట్టుగా అనిపిస్తుందని అంటున్నారు.

Video Advertisement

మ్యాచ్ చివర్లో తన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు టీమిండియాకు మరో ధోనీ దొరికాడని అంటున్నారు. అయితే ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
జట్టులో ఓపెనర్ల పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో, అలాగే ఫినీషర్ల పాత్ర కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభంలో ఎంత బాగా ఆడినప్పటికీ, మ్యాచ్ ను విజయవంతంగా ముగించే ఫినిషర్ లేకపోతే అప్పటిదాకా ఎంత స్కోర్ చేసిన వ్యర్థమే అవుతుంది. అలా అని జట్టులో ఫినీషర్లు మాత్రమే ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ధోనీ రిటైర్ అయినప్పటి నుండి భారత జట్టు మంచి ఫినీషర్ కోసం చూస్తోంది. ధోనీ లాగా మ్యాచ్ చివరి వరకు నిలిచి  మ్యాచ్ ను గెలిపించగల యువ క్రికెటర్ల పై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ భారత జట్టుకు ఎందరో మంచి ఆటగాళ్లను ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ ద్వారా మంచి ఫినీషర్ లభించినట్టుగా భావిస్తున్నారు. ఐపీఎల్‌ 16వ సీజన్ లో  భాగంగా సోమవారం నాడు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పై గెలిచింది.
మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి,  179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా జట్టు ఆఖరి బంతికి గెలుపును సాధించింది. కెప్టెన్ నితీశ్ రాణా 51 పరుగులు, ఆండ్రీ రసెల్ 42 పరుగులు, రింకు సింగ్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తమ జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్ లో  రింకూ సింగ్ ఫినీషర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కోల్‌క‌తా జట్టును గెలిపించాడు.  కోల్‌క‌తాకు వ‌రుస‌గా ఇది రెండవ విజ‌యం. దీనితో పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్ధానానికి కోల్‌క‌తా జట్టు చేరుకుంది.
రింకూ సింగ్ అంతకముందు మ్యాచ్ లో కూడా కీలక సమయంలో తన జట్టును ఆదుకున్నాడు. 35 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ చివరి ఓవర్. 5 బాల్స్ లో 28 ప‌రుగులు చేయాల్సి ఉండగా, ప్ర‌తీ బాల్ ని సిక్స‌ర్‌గా మార్చి గుజ‌రాత్ జట్టు పై కోల్‌క‌తా జట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఇలా వరుస మ్యాచ్ లలో రింకూ సింగ్ ప్రతిభను చూసినవారు భారత జట్టుకి మరో ధోనీ దొరికేశాడని అభిమానులు సంతోష పడుతున్నారు.

Also Read: IPL చరిత్రలో “వరస్ట్ ప్లేయర్స్” గా పేరు తెచ్చుకున్న 7 క్రికెటర్స్..! ఎవరెవరు ఉన్నారంటే..?


End of Article

You may also like