నా రీ ఎంట్రీ వెనకాల ఎమ్మెస్ కే ప్రసాద్ పాత్ర ఏమి లేదు… అంబటి రాయుడు

నా రీ ఎంట్రీ వెనకాల ఎమ్మెస్ కే ప్రసాద్ పాత్ర ఏమి లేదు… అంబటి రాయుడు

by Mounika Singaluri

Ads

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన క్రికెట్ జీవితం గురించి ఒక ఇంటర్వ్యూ లో పలు విశేషాలు పంచుకున్నారు. తాను 2018లో రీ ఎంట్రీ ఇవ్వడం వెనకాల msk ప్రసాద్ పాత్ర ఉందనేది అవాస్తవం అంటు కుండ బద్దలు కొట్టారు.తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ ఉందని క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, తన రీ యంట్రి విషయంలో msk క్లెయిమ్ చేసుకుంటున్నాంటూ సెటైర్లు వేశారు.

Video Advertisement

ఎమ్మెస్కే ప్రసాద్ తనకైతే ఫోన్ చేయలేదన్న రాయుడు, అలాగని ఆయన అబద్ధం చెప్పారని తాను అనడం లేదన్నారు. అయితే ఆటగాళ్ల ఎంపిక వెనుక ఓ ప్రొసీజర్ ఉంటుందన్నారు.ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే 2019 వరల్డ్ కప్‌‌కి నేను ఎంపిక కాలేదని msk ప్రసాద్ చెప్పలేదు.

ambati-rayudu-2

ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు యో-యో టెస్ట్ జరిగింది. రెండు వారాల్లో అది పాసయ్యాను. ఫిట్‌నెస్ కోసం కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎన్‌సీఏలో శిక్షణ పొందొచ్చు. దాని కోసం ఎవరూ ప్రత్యేకంగా లెటర్ రాయడం లాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని msk విషయంలో కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రోజుల నుంచి తాను ముందుకెళ్తుంటే చాలా మంది వెనక్కి లాగడానికి ప్రయత్నించారని రాయుడు తెలిపారు.

kumble comments about ambati rayudu..!!

మా క్రికెట్ భవిష్యత్తుకు సమాధి కట్టాలని నిర్ణయించడంతోనే తాను ఐసీఎల్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. ఐసీఎల్ లేకపోతే నేను ఎప్పుడో క్రికెట్ వదిలేసేవాణ్ని. ఆ లీగ్ ఫ్లాప్ అయినా మా ప్రతిభ బయటకొచ్చింది. హెచ్‌సీఏ మమ్మల్ని తీసేస్తే.. ఐసీఎల్ రూపంలో మాకు ఓ అవకాశం వచ్చింది. ఐసీఎల్ రెండేళ్లపాటు శిక్షణ, మ్యాచ్‌లు మాకెంతో ఉపకరించాయి అని రాయుడు తెలిపారు


End of Article

You may also like