“యశస్వి జైస్వాల్” లాగానే… IPL తో జీవితాలనే మార్చుకున్న 6 మంది ప్లేయర్స్..!

“యశస్వి జైస్వాల్” లాగానే… IPL తో జీవితాలనే మార్చుకున్న 6 మంది ప్లేయర్స్..!

by kavitha

Ads

ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ధనిక క్రికెట్ లీగ్ మన ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ లీగ్ లో దేశి మరియు విదేశి ఆటగాళ్లతో కూడిన పది జట్లు పోటీ పడుతాయి. ఈ జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.

Video Advertisement

ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు ఎంతో మంది యువ ఆటగాళ్లు గుర్తింపు తెచ్చుకున్నారు. తద్వారా జాతీయ జట్టుకి ఎంపిక అయ్యి, దేశం తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ ద్వారా ఎందరో పేద స్థితిలో ఉన్న ప్లేయర్స్ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. యశస్వి జైస్వాల్

ఐపీఎల్ యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ జీవితాన్ని పూర్తిగా మార్చింది. గత ఏడాది ఐపీఎల్ వేలంలో 2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ యశస్వి ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ జీవితం ఒక పోరాటం. అతను 2018 వరకు జీవనోపాధి కోసం రోజంతా ముంబై వీధుల్లో పానీపూరీని అమ్మేవాడు.

షెల్టర్ లేక రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ల పైనే పడుకున్నాడు. ప్రస్తుతం యశస్వికి ముంబైలో మంచి ఇల్లుతో పాటు మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ సీజన్‌లో యశస్వి అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. 21 ఏళ్ల యశస్వి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 13 బాల్స్ లో ఫిఫ్టీ సాధించి, ఐపీఎల్‌ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా యశస్వి పేరే వినిపిస్తోంది.
2. రింకూ సింగ్

ఐపీఎల్ ద్వారా పూర్ నుండి రిచ్ గా మారిన మరో ప్లేయర్ రింకూ సింగ్. 2018 ఐపీఎల్ వేలంలో కోలకతా జట్టు అతనిని 80 లక్షలకు కొనుగోలు చేసింది. అలా రింకూ సింగ్ వెలుగులోకి వచ్చాడు. రింకు సింగ్ తండ్రి ఎల్‌పిజి సిలిండర్లను డెలివరీ చేసేవాడు. వారి ఫ్యామిలీ ఆ గ్యాస్ ఏజెన్సీ కాంపౌండ్‌లోని స్టోర్‌రూమ్‌లో ఉండేవారు.

నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ కేవలం 6-7 వేల ఆదాయంతో అతి కష్టంగా జీవించేవారు. ఐపీఎల్ రింకూ సింగ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే, అతనికి ఆడటానికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయిన ఆ జట్టు అతన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
3. మహ్మద్ సిరాజ్

ఐపీఎల్ మహ్మద్ సిరాజ్ జీవితాన్ని మార్చింది. హైదరాబాద్‌ నుంచి ఐపీఎల్ క్రికెట్‌కు ఈ పేస్‌ బౌలర్‌ ప్రయాణం ఓ కథలా ఉంటుంది. అతను ఆటోడ్రైవర్ కుమారుడు. కుటుంబంతో కలిసి ఓ గదిలో నివసించేవారు. సిరాజ్ బాల్యం అంతా ఎన్నో కష్టాలతో కూడుకున్నది. అయితే ఐపీఎల్ అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సిరాజ్ ను అత్యధికంగా 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. సిరాజ్ 2018 నుండి రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. సిరాజ్ ప్రస్తుతం మంచి ఇంటితో పాటుగా, మంచి జీవితాన్ని గడుపుతున్నాడు, తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు.
4. టి నటరాజన్

టి నటరాజన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తన అద్భుతమైన ఆటతో వెలుగులోకి వచ్చాడు. అతని టాలెంట్ ను గుర్తించిన కింగ్స్ పంజాబ్ జట్టు 2017 ఐపీఎల్ వేలంలో మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది. నటరాజన్ అతి తక్కువ ఆదాయం కలిగిన  కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. నటరాజన్ తండ్రి రోజువారీ కూలీ, తల్లి మాంసం అమ్మేది. ప్రస్తుతం నటరాజన్‌కు వివాహమైంది. అతని పేరు మీద 2 ఫ్లాట్లు కూడా ఉన్నాయి.5. రవీంద్ర జడేజా:

రవీంద్ర జడేజా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విలువైన క్రికెటర్స్ లో ఒకరు. జడేజా తన చిన్నతనంలో  చాలా కష్టమైన రోజులను గడిపారు. అతను తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. జడేజా తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అతని ఆదాయం చాలా తక్కువగా ఉండేది. జడేజా చాలా కష్టపడ్డాడు.

రోజంతా గడపడానికి కేవలం 10 రూపాయలు ఉన్న రోజులు ఉన్నాయని ఒక సందర్భంలో జడేజా తెలిపారు. 2008లో భారతదేశం కోసం అండర్ 19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు జడేజా జీవితం మారిపోయింది. అతన్నిఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ 12 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం, అతను 7 కోట్ల ఐపీఎల్ శాలరీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు.6. చేతన్ సకారియా:

ఐపీఎల్ పూర్ టూ రిచ్ జాబితాలో తరువాతి ప్లేయర్ చేతన్ సకారియా. చేతన్ తక్కువ ఆదాయ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఆటో నడుపుతూ ఉండేవాడు. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఆ వృత్తిని ఆపాల్సి వచ్చింది. దాంతో చేతన్ సకారియా డబ్బు సంపాదించడానికి మరియు అతని క్రికెట్ ఖర్చుల కోసం మామ దుకాణంలో పని చేసేవాడు.
వివో ఐపీఎల్ 2021 లో చేతన్ తన ఆటతో సంచలనంగా మారాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.2 కోట్లకు  అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో చేతన్ ప్రదర్శనతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు టీ20 జట్టులోకి కూడా ఎంపిక అయ్యాడు. చేతన్ సకారియా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది.

Also Read: “ధోనీ” లాంటి క్రికెటర్, శతాబ్దానికి ఒక్కడే వస్తాడు..! సునీల్ గవాస్కర్


End of Article

You may also like