ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ద్వారా మనల్ని అలరిస్తున్నారు. ఇందులో ఈ వారం ఇంద్రజ చేసిన పర్ఫామెన్స్ కంటతడి పెట్టించేలా ఉంది. ఇందులో ఇంద్రజ ఒక టీచర్ పాత్ర పోషిస్తున్నారు. తన స్టూడెంట్స్ లో ఒకరికి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఇంద్రజ ఫీజు కడతారు.

కరోనా కారణంగా విద్యా సంస్థలు అన్నీ మూతపడడంతో టీచర్స్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఇందులో మనకు చూపించారు. టీచర్ పాత్ర పోషిస్తున్న ఇంద్రజ కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెట్రోల్ బంక్ లో పని చేయడం, కూరగాయలు అమ్మడం చేస్తారు. ఈ స్కిట్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కంటతడి పెట్టుకున్నారు. టీచర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఈ స్పెషల్ స్కిట్ ప్రసారం అవ్వబోతోంది.
watch video :



























