సాధారణంగా పౌరాణిక సినిమాలంటే ప్రేక్షకులకు సినిమాలు మాత్రమే కాదు. పౌరాణికం భారతీయ ప్రజల్లో ఎన్నో సంవత్సరాల నుండి నాటుకుపోయిన ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అందుకే ఎవరైనా సరే పౌరాణికం మీద సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీస్తారు.
ఎంత జాగ్రత్తగా తీసినా కూడా ఎక్కడో ఒకచోట పొరపాటు వస్తూనే ఉంటుంది. అది చాలా సహజం. చాలా మంది దర్శకులు పౌరాణిక కథల మీద, అది కూడా దేవుడి మీద సినిమా తీస్తున్నప్పుడు ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఆలోచన చేయరు. అందుకు కారణం ఇది చాలా సెన్సిబుల్ విషయం. ప్రేక్షకులు అవి కేవలం సినిమాలాగా మాత్రమే చూడరు.
అందుకే తమదైన ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా శైలిలో తెరపై అదే కథని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాతో రామాయణాన్ని తనదైన శైలిలో ప్రేక్షకులకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నం అంతగా ఫలించలేదు. అది కూడా రాముడి పాత్రలో ప్రభాస్ లాంటి హీరోని పెట్టి కేవలం హిందీలో మాత్రమే కాకుండా ఇతర భాష ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని అందించారు. కానీ ఎక్కడా కూడా ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభించట్లేదు. ఈ సినిమాకి మైనస్ అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 పైన చెప్పినట్టుగా సినిమాకి మైనస్ అయిన మొట్టమొదటి విషయం పాత్రలని చూపించిన విధానం. యానిమేటెడ్ సినిమాలు చూడటం కొత్త ఏమీ కాదు. కానీ అలా చూపించినప్పుడు అవి ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపించకుండా చూడగలిగేలాగా అనిపిస్తే వాటికి కూడా ఆదరణ బాగుంటుంది. కానీ ఈ సినిమాలో పాత్రలని రూపొందించిన విధానం మాత్రం ప్రేక్షకులకు అంత పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు.
కొన్ని చోట్ల ప్రభాస్ పరిగెడుతూ ఉంటే బాడీ డబుల్, అంటే డూప్ ఉపయోగించారు అని ఇంత గ్రాఫిక్స్ చేసినా కూడా తెలిసిపోతుంది. అసలు వనవాసానికి వెళ్లే ముందు ప్రభాస్ ని ఒక రాజు లాగా వైట్ అండ్ వైట్ గెటప్ లో చూపించిన సీన్ అయితే ట్రోల్ అవుతోంది. ఇంక లంకేష్ పాత్రని రూపొందించిన విధానం గురించి అయితే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
#2 సెకండ్ హాఫ్ మొత్తం సినిమాకి మైనస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఒకటి రెండు సీన్లు తప్ప గొప్పగా చెప్పుకునే సీన్లు ఒక్కటి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలాగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ ఎంత బాగున్నాయో సెకండ్ హాఫ్ లో అంత డౌన్ అయ్యాయి. ఎప్పుడు అయిపోతుందా అని చూసే వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు.
#3 ఒక సినిమాకి, అది కూడా ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలకి డైలాగ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో డైలాగ్స్ కొంచెం సంస్కృతం మిక్స్ అయ్యి, గ్రాంధిక భాషలో ఉంటాయి. ఈ సినిమాలో డైలాగ్స్ సాధారణంగా ఉండేలా అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి అని ప్రయత్నించారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మరీ కమర్షియల్ సినిమాల్లో ఉండే డైలాగ్స్ లాగా చాలా చోట్ల అనిపించాయి. దాంతో, “అసలు ఈ సినిమాకి కమర్షియల్ అంశాలు ఉండాల్సిన అవసరం ఏముంది?” అని కామెంట్స్ వస్తున్నాయి.
#4 సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే తప్పులు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ ఉన్న సీన్స్ లో అయితే అక్కడ ఉన్నది ప్రభాస్ కాదు డూప్ అని అర్థం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా కనిపిస్తారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత యానిమేషన్ చేసిన వారు ఇంత చిన్న విషయాలని అంత అజాగ్రత్తగా ఎలా వదిలేశారు అని అనిపిస్తుంది.
#5 ఇది ఒక తెలుగు సినిమా అనడం కంటే, తెలుగు నటుడు ప్రభాస్ నటించిన ఒక హిందీ సినిమా అనడం నయం ఏమో. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ తప్ప తెలుగు మాట్లాడే నటులు ఒక్కళ్ళు కూడా లేరు. కొన్ని క్లోజప్ షాట్స్ లో నటీనటులు తెలుగు మాట్లాడతారు. కానీ చాలా మంది నటులు హిందీ మాట్లాడితే తెలుగు డబ్బింగ్ వస్తుంది.
ఇంకొక విషయం ఏంటంటే తెలుగు డబ్బింగ్ లో కూడా ప్రభాస్ తో పాటు చాలా మంది నటీనటులకి సౌండ్ ముందు వచ్చేసి, వాళ్ళ లిప్ మూమెంట్ తర్వాత వస్తుంది. దాంతో చాలా మంది సౌత్ ప్రేక్షకులకి, అందులోనూ తెలుగు ప్రేక్షకులకి కచ్చితంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అయితే అనిపించదు.
ప్రస్తుతం అయితే ఆదిపురుష్ టాక్ ఇలా ఉంది. కొన్నిసార్లు టాక్ ఎలా ఉన్నా కూడా కొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.