బ్రెజిల్లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో ఆమె భర్త వేదికనెక్కి హల్చల్ చేశాడు. విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. దీంతో ఆ కిరీటం ముక్కలు ముక్కలుగా మారింది. బ్రెజిల్లో గత శనివారం (27) జరిగిన మిస్ గే మాటో గ్రోస్సో 2023 అందాల పోటీలో ఈ సంఘటన జరిగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
బ్రెజిల్ లో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలా మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.. రౌండ్ల వారీగా జల్లెడ పట్టగా చివరికి నాథల్లీ బెకర్, ఇమాన్యుయెల్లీ బెలిని ఇద్దరు ఫైనలిస్టులుగా నిలిచారు. వారిలో ఒకరి విజేతగా ప్రకటించేందుకు ఒక మహిళ కిరీటంతో వచ్చింది. ప్రేక్షకులు అరుపులతో వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇదే క్రమంలో ఇమాన్యుయెల్లీ బెలిని జడ్జిలు విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని తొడిగేందుకు సిద్ధమయ్యారు.

అయితే రన్నరప్ నాథల్లీ బెకర్ భర్త హఠాత్తుగా వేదిక పైకి వచ్చి కిరీటాన్ని లాక్కొన్నాడు. దానిని నేలకేసి కొట్టి నానా రచ్చ చేశాడు. అక్కడున్న వారిపై కోపంతో అరుస్తూ హడావుడి సృష్టించాడు. తన భార్య విజేత కాలేదనే కోపంతో గందరగోళం చేసాడు. ఈ అనూహ్య ఘటనకు అందరూ షాక్‌కు గురయ్యారు. అనంతరం భార్య నాథల్లీ బెకర్‌ను చేయిపట్టుకుని లాక్కెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరోసారి కిరీటాన్ని నేలకేసి కొట్టి ముక్కలు చేసాడు సదరు వ్యక్తి. అక్కడున్నవారు వారించినా వినలేదు.

వెంటనే ఈవెంట్ నిర్వాహకులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని స్టేజ్ నుంచి కిందికి పంపేశారు. అతనితో పాటు అతని భార్యను కూడా వెళ్ళిపోయింది. ‘మిస్ నాథల్లీ బెకర్ రెండో స్థానంలో నిలవడం న్యాయబద్దమైనదిగా ఆమె భర్త భావించలేదు. అందుకే ఆ విధంగా ప్రవర్తించారు . అతని చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ పేజెంట్ కోఆర్డినేటర్ మలోన్ హేనిష్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
watch video:











#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
ఈ చిత్రాలలో ప్రతి రాష్ట్రం యొక్క సంప్రదాయం, సంస్కృతి, ఆహారం, అభివృద్ధిని చక్కగా చూపించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. AI వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందో ఈ ఫోటోల ద్వారా చూడవచ్చు.
2. సూరత్ మెట్రోలో ప్రయాణికులను ఇలా చూపించారు. పైన వజ్రాలను AI సృష్టించింది.
3. హర్యానా మెట్రోలో చాలా మంది తమ సంప్రదాయ వస్త్రధారణలో ఉండగా, వారి చేతుల్లో కర్రలు పట్టుకుని హర్యానా సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు.
4. చెన్నైమెట్రో అత్యంత ఆసక్తికరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూర్చుని ప్రయాణం చేస్తుండటం కనిపిస్తుంది.
5. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలిజం ఎక్కువ. అందువల్ల ఛత్తీస్‌గఢ్ మెట్రోలో ప్రయాణం ఈ విధంగా ఉంటుందని AI చిత్రాన్ని రూపొందించింది.
6. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సంప్రదాయాలకు చాలా విలువను ఇస్తారు. అందువల్ల కన్యాకుమారి మహిళలు మెట్రోలో ప్రయాణిస్తే ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
7. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అందువల్ల హైదరాబాద్ మెట్రోలో AI బిర్యానీ ఉన్నట్టుగా రూపొందించింది.
8. ఉత్తర ప్రదేశ్ లో దుండగులు నాటు తుపాకులతో తిరుగుతూ ఉంటారు. అందువల్ల యూపీ మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
9. కోటా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది.
10. కోల్ కతా మెట్రోలో చేపలు పట్టుకుని ప్రయాణిస్తూన్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
11. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం లిట్టి చోఖా. అందువల్ల అక్కడి మెట్రోలో లిట్టి చోఖా ఉన్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
12. బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల అక్కడి మెట్రోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
13. కాశ్మీర్ లో మంచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాశ్మీర్ మెట్రోలో మంచు కూరుస్తున్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
14. రాజస్థాన్ ఎడారి, ఒంటెలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల రాజస్థాన్ మెట్రోలో ఎడారిలో ఒంటెలు ఉన్నట్లుగా AI ఫోటోను రూపొందించింది.
15. ఒడిశా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది. 
AI రూపొందించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఈ చిత్రాలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.












స్టోరీ :
కొన్ని పరిస్థితుల వల్ల ఊళ్లోనే గౌరవంగా జీవించాలని నిర్ణయించుకున్న ముగ్గురు టెంట్‌హౌజ్ పెడతారు. అయితే టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదంలో కాలిపోతుంది. దాంతో అప్పులు పాలవుతారు. వారు ఎలా అప్పు తీర్చారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఊళ్ళో గౌరవంగా బ్రతికరా? అనేదే కథ.
సిరి రాశి తమ పాత్రలో పర్వాలేదనిపించుకుంది.శివ నందన్ లిప్‌స్టిక్ స్పాయిలర్ లింగంగా మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంజిమామ, మురళీధర్ గౌడ్ మూవీకి ప్రధాన ఎస్సెట్స్. వారి క్యారెక్టర్ల ద్వారా పండిన కామెడీని ఆడియెన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు.
పాత్రలు మరియు కథ విషయంలో ఎక్కువ డెప్త్ లేకుండా చాలా సింపుల్ గా స్టోరి -కథనాన్ని రాసుకున్న తీరు బాగుంది. ఒకడు ఎదగాలి అని అనుకున్నప్పుడు చుట్టూ ఉండేవారు ఎలా సాయం చేస్తారనే విషయాన్ని పాజిటివ్ గా చూపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి తక్కువ బడ్జెట్ సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్రేమింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తపడితే ఇంకా బాగుండేది.
ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సమకూర్చిన సాంగ్స్, నేపధ్య సంగీతం సరిగా పని చేయలేదు. పాటలతో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీని ఎలివేట్ చేయడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఒక గ్రామంలో చాలా సింపుల్ గా మూవీ మొత్తాన్ని తీశారు. దాంతో సహజత్వం ఎక్కడా మిస్ అవ్వలేదు.




