వివాహం చేసుకునేవారు తమ లైఫ్ లోని ముఖ్యమైన రోజున ప్రత్యేక క్షణాలను జ్ఞాపకలుగా మార్చుకోవడం కోసం ఫోటోగ్రాఫర్లను ఎంచుకోవడం అనేది సాధారణం అయిపోయింది.
పెళ్లిలో వధూవరుల ఫోటోలు అద్భుతంగా తీసి ఫోటోగ్రాఫర్లు వారికి ఆనందం కలిగిస్తారేమో. కానీ ఆ జంట కలిసి ఉండేందుకు హామీ ఇవ్వలేరు. పెళ్లి చేసుకుని, నాలుగేళ్ళకి డీవోర్స్ తీసుకున్న ఒక యువతి,పెళ్లిరోజు ఫోటోషూట్‌కు ఇచ్చిన డబ్బులను రీఫండ్ చేయమని సదరు ఫోటోగ్రాఫర్‌ను డిమాండ్ చేసిన ఘటన తాజాగా వైరల్ అయ్యింది.
ఇటీవల కాలంలో పెళ్లికి ముందు తరువాత వధూవరుల ఫోటోషూట్ లు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఖర్చుకు వెనకడకుండా మంచి ఫోటోగ్రాఫర్‌ను వెతికి, మరి ఎంచుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్లు అద్భుతంగా ఫోటోలు తీయగలరు. కానీ పెళ్లి చేసుకున్న జంట వైవాహిక జీవితానికి హామీ అయితే ఇవ్వలేరు. వివహం చేసుకున్న నాలుగు ఏళ్ళకి భర్త నుండి విడాకులు తీసుకున్న యువతి. తన పెళ్లిరోజు ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్‌ను తాము ఇచ్చిన డబ్బులు ‘రీఫండ్’ చేయమని అతనికి మెసేజ్ పంపించింది.
అవి చూసిన ఫోటోగ్రాఫర్ ఆ యువతి జోక్ చేస్తుందేమోనని ముందుగా భావించాడు. కానీ, ఆ తరువాత ఆమె బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టడంతో ఆ ఫోటోగ్రాఫర్ ఆ చాట్ మొత్తాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఆ చాట్ లో ఇలా ఉంది “మీకు ఇప్పటి వరకు నేను జ్ఞాపకం ఉన్నానో, లేదో తెలియదు. డర్బన్‌లో 2019లో జరిగిన నా వివాహ వేడుకలో మీరు ఫోటో షూట్ చేశారు. ఇప్పుడు నేను అతనితో డీవోర్స్ తీసుకున్నాను. మీరు పెళ్లి రోజు తీసిన ఫోటోలు నాకు అవసరం లేదు. పెళ్లి రోజున మీరు చాలా బాగా పని చేసారు. కానీ, ప్రస్తుతం మేము డీవోర్స్ తీసుకోవడం వల్ల ఆ ఫోటోలు వృథా అయ్యాయి. కాబట్టి మేము ఫోటో షూట్ కోసం మీకు ఇచ్చిన పూర్తి డబ్బును తిరిగి చెల్లించండి” అని ఆ యువతి మెసేజ్ చేసింది.
మొదట్లో ఫోటోగ్రాఫర్ ఆ యువతి జోక్ చేస్తుందేమోనని అనుకున్నాడు. అయితే, ఆ యువతి సీరియస్‌గా అడిగిందని ఆ తర్వాత అతనికి అర్ధం అయ్యింది. వారిద్దరి మెసేజ్ లలో వాదించుకోగా, చివరికి ఆ యువతి వార్నింగ్ ఇచ్చే వరకూ వెళ్ళింది. ఫోటోగ్రాఫర్ ఆ డబ్బును రీఫండ్ చేయలేనని చెప్పగా, ఆ యువతి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆ ఫోటోగ్రాఫర్ వారిద్దరి మధ్య జరిగిన చాట్‌ను స్క్రీన్షాట్లు తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

















#8
#9
#10
#11
#12













కథ:
రివ్యూ:
ఉగ్రం మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకి, అల్లరి నరేష్ లోని కామెడీ యాంగిల్ అనేది గుర్తుకు రాదు. నరేష్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. నరేష్ వైఫ్ గా మర్నా మీనన్ బాగానే చేసింది. డాక్టర్‌గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా, కథనాన్ని నడిపించిన విధానం ఎఫెక్ట్‌గా అనిపించదు. ఫస్టాఫ్ మూవీ అంతా చాలా నెమ్మదిగా రొటీన్, యాక్షన్ డ్రామాల సాగుతుంది. లవ్ ట్రాక్ ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సెకండాఫ్‌లో ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ను ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.




