Chanakya Neethi : మీ స్నేహితులు నిజమైనవారో కాదో తెలుసుకోండి ఇలా..!

Chanakya Neethi : మీ స్నేహితులు నిజమైనవారో కాదో తెలుసుకోండి ఇలా..!

by Megha Varna

Ads

స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఉంటే నిజంగా కొండంత బలం. కానీ కొందరు స్నేహితులు మాత్రం వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మీకు కూడా స్నేహితులు ఉన్నారా…? అయితే నిజమైన స్నేహితుడుని ఎలా గుర్తించాలి అని అనుకుంటున్నారా..?

Video Advertisement

అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను తప్పక మీరు చూడాలి. దీన్ని చూస్తే కచ్చితంగా మీరు నిజమైన స్నేహితులుని గుర్తించవచ్చు. ఒకవేళ కనుక మీ స్నేహితులులో ఈ లక్షణాలు లేక పోతే వాళ్ళు నిజమైన స్నేహితులు కారు అని మీరు తెలుసుకోవచ్చు.

#1. అనారోగ్యం సమయంలో తోడుగా ఉండడం:

అనారోగ్యంతో బాధ పడే సమయంలో నిజమైన స్నేహితులు ఎవరూ కూడా విడిచి పెట్టి వెళ్లిపోరు. నిజానికి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేస్తారు.

#2. అండగా ఉండడం:

ఆపద వేళల్లో ఆదుకోవడం, మీ కుటుంబ సభ్యులు కానీ ఆప్తులు కానీ చనిపోతే మీ పక్కన ఉండడం నిజమైన స్నేహితులు లక్షణాలు.

#3. కష్ట పరిస్థితులులో తోడుగా ఉండడం:

కొందరు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు కానీ కష్ట సమయంలో అలా వదిలేసి వెళ్లిపోతారు. నిజానికి అలాంటి స్నేహితులు ఉన్నా కూడా వృధానే. నిజమైన స్నేహితులు ఎప్పుడూ కూడా క్లిష్ట పరిస్థితుల్లో పక్కన ఉంటారు అని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నారు.

#4. ఆర్థిక సంక్షోభంలో సహాయం చేయడం:

ఆర్థిక సంక్షోభంలో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు అని చాణక్య నీతి చెబుతోంది. మీ సమస్యను అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడడానికి మీతో పాటు నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఉంటాడు.


End of Article

You may also like