“అంత గొప్ప సినిమాని కార్టూన్ సినిమా చేసారేంట్రా..?” అంటూ… “బాహుబలి” ఇంగ్లీష్ డబ్బింగ్‌పై నెటిజన్స్ కామెంట్స్..!

“అంత గొప్ప సినిమాని కార్టూన్ సినిమా చేసారేంట్రా..?” అంటూ… “బాహుబలి” ఇంగ్లీష్ డబ్బింగ్‌పై నెటిజన్స్ కామెంట్స్..!

by Mohana Priya

Ads

తెలుగు సినిమాని ఒక రేంజుకి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో మొదలైన ఉత్కంఠ, సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా, ప్రశంలు అందాయి.

Video Advertisement

అందులో బాహుబలిగా ప్రభాస్, బళ్ళాలదేవునిగా రానా దగ్గుబాటి, దేవసేనగా అనుష్క శెట్టి, శివగామి దేవిగా రమ్య కృష్ణ, బిజ్జల దేవగా నాజర్, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్య రాజ్, ఇలా ప్రతీ ఒక్కరూ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తొలుత బాహుబలి పార్ట్ 1 లో ప్రభాస్ శివుడిగా పరిచయం అవుతాడు.

baby tanvi bahubali

అందులో కొండపైన జలపాతం దాటి ఇంకేదో ఉందని శివుడు నమ్ముతాడు. తద్వారా పైకి వెళ్ళడానికి ఎన్నో పాట్లు పడతాడు.  శివుడి తల్లి మాత్రం బాహుబలికి ఏమవుతుందో అనే భయంతో, శివుడిని వెనక్కి లాగుతుంది. ఇంకోసారి శివుడు కి ఆ కొండపై దృష్టి వెళ్లకుండా ఉండేందుకు, శివలింగానికి నదిలో నుండి నీళ్ళు మోసుకొచ్చి, అభిషేకం చేస్తుంది. ఇది తెలిసిన తెలిసిన శివుడు(ప్రభాస్) తల్లిని గెలిపించాలని అని శివలింగాన్ని ఎత్తుకుని జలపాతం కింద పెట్టి… అమ్మా ఇప్పుడు శివుయ్యకు గడియ గడియ తానాలే ఒప్పెనా అంటాడు.

bahubali

ఇది బాహుబలి సినిమా పార్ట్ 1లో ఎంతో కీలకమైన, అద్భుతమైన, ఆశ్చర్యవంతమైన సన్నివేశం. సినిమాలో ఎన్నో సీన్స్ ఉన్నప్పటికీ ఈ సీన్ అంటే అభిమానులకి ఎంతో ఇష్టం. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది. దీంతో ఈ వీడియో అందరికీ షేర్ అవుతూ వెళ్లి, నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. కొందరు ఈ వీడియో ను చూసి నవ్వుతూ ఉండగా… మరి కొందరు ఇంత గొప్ప సినిమాని కార్టూన్ లాగా తీసి అవమానిస్తారా అంటూ మండిపడుతూ కామెంట్లు చేశారు.

9 bahubali 2

అటు సినీ అభిమానులు, హీరో ప్రభాస్ అభిమానులు కొందరు నవ్వుకుంటే కొందరు దుమ్మెత్తి పోశారు. సంవత్సరాలు తరబడి వాళ్ళు అంత కష్టపడితే ఇలా చెయ్యడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. మరికొందరు డైలాగులు, అంతా బాగానే ఉన్నాయి కానీ ఆ స్లాంగ్ ఏ బాలేదు అని, చిన్న పిల్లల కార్టూన్ లా ఉందని అన్నారు. ఏదేమైనప్పటికీ బాహుబలి తరువాత తెలుగు సినీ పరిశ్రమ కీర్తి ప్రతిష్టలు తారా స్థాయికి చేరుకుంది. ఇక ఆ సినిమాలో కొన్ని సీన్స్ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దీని మీద ఎంత మంది కామిడీ చేసినా, చిత్ర బృందం చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఎంజాయి చేస్తుంది.

watch video :


End of Article

You may also like