“టెస్ట్ కెప్టెన్సీ” వదులుకున్నప్పుడు…కోహ్లీ మరియు ధోనిలో ఈ కామన్ పాయింట్స్ గమనించారా.?

“టెస్ట్ కెప్టెన్సీ” వదులుకున్నప్పుడు…కోహ్లీ మరియు ధోనిలో ఈ కామన్ పాయింట్స్ గమనించారా.?

by Mohana Priya

Ads

ఎవరూ ఊహించని విధంగా విరాట్ కోహ్లీ భారత జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్ లలో 40 టెస్ట్ మ్యాచ్ లు గెలవడంతో విరాట్ కోహ్లీ ఒక సక్సెస్ ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కంటే కూడా 13 మ్యాచ్ లు ఎక్కువ గెలిచారు విరాట్ కోహ్లీ.

Video Advertisement

విరాట్ కోహ్లీ 25 సిరీస్ మ్యాచ్ లకి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అందులో 18 గెలవగా, 6 మ్యాచ్ లు ఓడిపోయారు. ఒకటి డ్రాగా నిలిచింది. భారత్లో జరిగిన 11 టెస్ట్ సిరీస్ లో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే కోహ్లీ ఓడిపోయారు.

common points between kohli and dhoni before stepping down from test captaincy

కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లో, ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో కోహ్లీ ఓడిపోయినప్పటికీ, అందులో రెండు సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా కోహ్లీ కెప్టెన్‌గా 20 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశారు. కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ మాత్రమే ఎక్కువ టెస్ట్ సెంచరీలు చేసిన ఘనతని సాధించారు. కోహ్లీకి, ధోనికి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది.

common points between kohli and dhoni before stepping down from test captaincy

అది ఏంటంటే, టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు ధోని 33 సంవత్సరాలు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వయసు 33 సంవత్సరాలు. ఇద్దరు 7 సంవత్సరాలు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. SENA (సౌత్ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా)లో ధోని 14 సార్లు ఓడిపోయారు, ఒక సిరీస్ గెలిచారు. కోహ్లీ కూడా 14 సార్లు ఓడిపోయారు. ఒక సిరీస్ గెలిచారు. అలా ఇద్దరికీ మధ్య ఈ కామన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట.


End of Article

You may also like