IPL లో 9 “టీమ్స్” కి ఆడిన ప్లేయర్ ఎవరో తెలుసా..? ఈ సంవత్సరం ఏ టీమ్ కి ఆడబోతున్నారు అంటే..?

IPL లో 9 “టీమ్స్” కి ఆడిన ప్లేయర్ ఎవరో తెలుసా..? ఈ సంవత్సరం ఏ టీమ్ కి ఆడబోతున్నారు అంటే..?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది.

Video Advertisement

ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలౌతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ఆడబోతున్నారు. ఆరోన్ ఫించ్ ఇప్పటికీ 9 జట్ల తరఫున ఆడారు.

cricketer who played for 9 teams in ipl

# 2010 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు.

# 2011-12 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్) నుండి ఆడారు.

# 2013 లో పుణే వారియర్స్ ఇండియా తరఫున ఆడారు.

# 2014 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడారు.

# 2015 లో ముంబై ఇండియన్స్ నుండి ఆడారు.

# 2016-17 లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడారు.

# 2018 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుండి ఆడారు.

# 2020 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుండి ఆడారు.

# 2008, 2009, 2019, 2021 లో ఐపీఎల్ లో పాల్గొనలేదు.

cricketer who played for 9 teams in ipl

ఇప్పుడు 85 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో, ఫించ్ 14 హాఫ్ సెంచరీలతో పాటు వరుసగా 25.38, 127.71 యావరేజ్, స్ట్రైక్ రేట్‌తో 2,005 పరుగులు చేశారు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించారు ఫించ్. ఈ సంవత్సరం ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడబోతున్నారు.


End of Article

You may also like