మీరు ఆన్లైన్ లో సిలిండర్ బుక్ చేస్తున్నారా..? అయితే ఇది తప్పక చదవండి..!!

మీరు ఆన్లైన్ లో సిలిండర్ బుక్ చేస్తున్నారా..? అయితే ఇది తప్పక చదవండి..!!

by Mohana Priya

Ads

ప్రస్తుతం మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వెహికల్ బుక్ చేసినప్పుడు కానీ తప్పనిసరిగా అవసరమయ్యేది ఓటీపీ. ఓటీపీ చాలా పనులకి ఒక కన్ఫర్మేషన్ కోడ్ అయిపోయింది. ఎన్నో ముఖ్యమైన పనులు ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఓటీపీ ద్వారా మన బదులు తప్పు దారిలో ఇంకెవరు మన పని చేయకుండా, లేదా ఇంకా ఏమైనా పొరపాట్లు జరగకుండా కూడా నియంత్రించవచ్చు.dac indane gas booking

Video Advertisement

అయితే ప్రస్తుతం ఇంకొక దానికి కూడా ఓటీపీ అనేది ఖచ్చితం చేశారు. మనలో చాలా మంది గ్యాస్ సిలిండర్లు వాడతాం. సిలిండర్ కావాలంటే ఫోన్ చేసి బుక్ చేసుకుంటాం. ఇండేన్ గ్యాస్ సంస్థ ఇలాంటి ఒక కోడ్ ని ప్రవేశపెట్టింది. దాని పేరే డెలివరీ ఆతెంటికేషన్ కోడ్. దీనిని డ్యాక్ అని కూడా అంటారు. ట్విట్టర్ వేదికగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఒక పోస్ట్ షేర్ చేసింది.

అందులో మనం ఇండేన్ గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారి ఒక  డ్యాక్ జనరేట్ అవుతుంది అని, డెలివరీ అతనికి ఈ డ్యాక్ షేర్ చేయాలి అని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓటీపీ యే. ఈ కోడ్ ఎస్ఎంఎస్ రూపంలో ఫోన్ కి వస్తుంది. ఇందులో నాలుగు నంబర్స్ ఉంటాయి. డెలివరీ బాయ్ కి ఈ కోడ్ చెప్పి సిలిండర్ తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్ ని నియంత్రించడానికి ఇండేన్ సంస్థ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.


End of Article

You may also like