హైదరాబాద్ లోని ఓ జంట సరికొత్త ఆలోచన…మా బిడ్డకు కులం మతం వద్దు.!

హైదరాబాద్ లోని ఓ జంట సరికొత్త ఆలోచన…మా బిడ్డకు కులం మతం వద్దు.!

by Anudeep

Ads

కట్టుబాట్లని కాదని కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నప్పటికి పుట్టిన బిడ్డలకు కులాన్ని,మతాన్ని వర్తింప చేస్తుంది ఈ ప్రభుత్వం మరియు సమాజం..బిడ్డ పుట్టగానే ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుండి, స్కూల్ అడ్మిషన్, తర్వాత ఇచ్చే ప్రతి సర్టిఫికెట్లో కులం,మతాన్ని మెన్షన్ చేయమంటుంది..లేదంటే చెల్లదంటుంది..మేజర్ గా తండ్రి ఇంటిపేరే బిడ్డలకి వస్తుంది కాబట్టి ఇలాంటి వివాహాల్లో కూడా తండ్రి కులమే పుట్టిన పిల్లలకు వర్తిస్తుంది.అయితే తాము వదిలేసుకున్న కులమతాలు తమ బిడ్డకు వద్దంటూ కోర్టుకి ఎక్కారు హైదరాబాద్ తల్లిదండ్రులు.

Video Advertisement

హైదరాబాద్‌కు చెందిన డేవిడ్, రూప దంపతులు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు..వారి కులాలు వేరు, మతాలు వేరు..వారి ప్రేమకు గుర్తుగా గత ఏడాది మార్చి 23న బిడ్డ జన్మించాడు. ఇవాన్ రూడే గా పేరు పెట్టుకున్నారు. తమ కుమారుడు ఇవాన్ రూడే బర్త్ సర్టిఫికెట్ కోసం  కొత్తకోట మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు  రూప, డేవిడ్. జనన నమోదు దరఖాస్తులోని కుటుంబ ‘మతం’ అనే కాలమ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని అక్కడి అధికారులు చెప్పారు.

కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న తాము మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి దరఖాస్తులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలమ్ నింపము అని వీళ్లు చెప్పడంతో అధికారులు తిరస్కరించారు. తర్వాత  జిల్లా కలెక్టర్‌ను, ఆపై అధికారులను ఆశ్రయించారు.. అక్కడ కూడా కుదరదు అనే సమాధానమే వచ్చింది .దాంతో తమ హక్కును, మనోభావాలను గౌరవిస్తూ తమ కుమారుడి జననం మొదలు మరణం వరకు ప్రభుత్వం ఇచ్చే ఏ సర్టిఫికెట్‌లోనైనా ‘మతం – కులం లేనివాళ్లు (No Religion – No Caste)’ అని గుర్తింపు ఇవ్వాలని కోరుతూ పిల్ వేశారు.

జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దంపతుల డిమాండ్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జనన మరణ ధ్రువీకరణ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు నాలుగు వారాల గడువు విధించింది .

గతంలో తమిళనాడుకు చెందిన స్నేహ అనే లాయర్ కుల మతంలేని మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. మొదట్లో ఆమెకి నో కాస్ట్- నో రెలిజియన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తే, కలెక్టర్ ని కలిసి సర్టిఫికెట్ పొందారు. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన డి.వి. రామకృష్ణ రావు, ఎస్. క్లారెన్స్ కృపాళిని దంపతులు కూడా ఇదే డిమాండ్‌పై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లల అడ్మిషన్ సందర్భంగా మతం అనే కాలమ్ నింపితే తప్ప అడ్మిషన్ ఇవ్వమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మతం చెప్పడానికి నిరాకరించిన కారణంగా అడ్మిషన్ ఇవ్వకపోవడం సరికాదని కోర్టు మొట్టికాయలు వేయడంతో స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ ఇచ్చింది.

కొన్ని ప్రత్యేక సంధర్బాల్లో మాత్రమే “నో క్యాస్ట్ – నో రెలిజియన్” సర్టిఫికెట్ లభిస్తుంది.ఆ సర్టిఫికెట్ పొందడానికి కూడా పెద్ద యుద్దమే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల్లో ఈ కాలమ్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో.. వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది. అందువల్ల మా హక్కును గుర్తించాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకునేలా కోర్టు ఆదేశించాలి.”అని రూప, డేవిడ్ దంపతులు కోరుతున్నారు.


End of Article

You may also like