ప్రతి సారి IPL అప్పుడే ఈ “ఇంగ్లాండ్” వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు?

ప్రతి సారి IPL అప్పుడే ఈ “ఇంగ్లాండ్” వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు?

by Mohana Priya

Ads

ఐపీఎల్ ఆడాలని చాలా మంది క్రికెటర్లు కూడా కలలు కంటూ ఉంటారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఇది ఒక అవకాశంలాగా ఎంతో మంది ప్లేయర్స్ భావిస్తారు. అలాంటిది ఈ ఐపీఎల్ లో చాలా మంది వేలంలో ఎంపికైన ప్లేయర్స్ సడన్ గా తప్పుకుంటున్నారు. దీని వల్ల జట్టు యాజమాన్యాలకి కూడా ఇబ్బంది కలుగుతోంది.

Video Advertisement

అది కూడా వీరందరూ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కావడం చర్చనీయాంశంగా మారింది. కొందరు గాయాల కారణంగా మ్యాచ్ కి దూరం అవుతూ ఉంటే, మరికొందరు మాత్రం బయో బబుల్ ఒత్తిడి తట్టుకోలేక దూరమవుతున్నట్లు చెబుతున్నారు.

england cricketer markwood to quit ipl 2022

ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన అలెక్స్ హేల్స్, అలాగే గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన జేసన్ రాయ్ లీగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో జట్టు యాజమాన్యాలు మళ్లీ వేరే వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్‌వుడ్ కూడా తప్పుకునే ఉద్దేశంతో ఉన్నారు. రెండు రోజుల క్రితం మ్యాచ్ ఆడుతూ గాయపడ్డారు. దాంతో ఈ ఐపీఎల్ లో ఉండకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.

england cricketer markwood to quit ipl 2022

గత సంవత్సరం జానీ బెయిర్‌స్టో, క్రిస్‌ వోక్స్‌, డేవిడ్‌ మలాన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ సీజన్ మొదలైన తర్వాత తప్పుకున్నారు. ఇప్పుడు మార్క్‌వుడ్ వేలం అయ్యాక తప్పుకున్నారు. ఈ విషయంపై ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, ” బయో బబుల్ ఫాటిగ్ అని సీజన్ మొత్తం ఉంటాము అని ఒప్పందం చేసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలా జరిగితే భవిష్యత్తులో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.” అని అన్నారు.


End of Article

You may also like