ఈ 5 పండ్లతో.. లివర్ సమస్యలకి చెక్..!

ఈ 5 పండ్లతో.. లివర్ సమస్యలకి చెక్..!

by Megha Varna

Ads

అన్నింటి కంటే పెద్ద అవయవం లివర్. మనం కచ్చితంగా లివర్ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చాలామంది లివర్ కి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారు. లివర్ ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఐదు పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Video Advertisement

అయితే మరి లివర్ ఆరోగ్యానికి సంబంధించి వివరాలను మనం చూద్దాం. లివర్ ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి పండ్లని డైట్ లో చేర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

#1. ఆపిల్:

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు. పైగా లివర్ ఆరోగ్యానికి కూడా ఆపిల్ చాలా మంచిది. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన లివర్ ని పొందాలంటే ఆపిల్ ని కచ్చితంగా తీసుకోండి.

#2. ద్రాక్ష:

ద్రాక్ష పండ్లు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎరుపు రంగు లేదా పర్పుల్ రంగు ద్రాక్ష పండ్లు తీసుకుంటే లివర్ ఆరోగ్యం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#3. అవకాడో:

అవకాడో కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అవకాడో తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. అలానే లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

#4. నిమ్మ:

నిమ్మ కూడా ఆరోగ్యకరమైన లివర్ ని పొందడానికి సహాయం చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది.

#5. బెర్రీస్:

క్రాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి తీసుకుంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక లివర్ ఆరోగ్యం బాగుండాలంటే వీటిని డైట్ లో చేర్చుకోండి. ఇలా ఐదు పండ్లని డైట్ లో చేర్చుకోవడం వల్ల లివర్ సమస్యలకు దూరంగా ఉండడానికి కూడా అవుతుంది. లివర్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవుతుంది.


End of Article

You may also like