ఈ అలవాట్లను వదులుకోకపోతే.. బట్టతల రావడం ఖాయం.. అవేంటో చూడండి..!

ఈ అలవాట్లను వదులుకోకపోతే.. బట్టతల రావడం ఖాయం.. అవేంటో చూడండి..!

by kavitha

Ads

జుట్టు రాలిపోవడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం, బట్టతల ఇలా చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎక్కువ మంది బట్టతలతో ఇబ్బంది పడుతూ వుంటారు. నిజానికి బట్టతల మగవారి అందాన్ని తగ్గించేస్తుంది. దీని కోసం మగవాళ్ళు చాలా రకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు

Video Advertisement

ఎక్కువగా మగవారికి మాత్రమే బట్టతల వస్తుంది. చాలా అరుదుగా ఆడవాళ్ళలో బట్టతల ఉంటుంది. మగవారికి బట్టతల రావడానికి కారణం మగవారి లో ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్. ఈ హార్మోన్ కారణంగానే మగవారిలో బట్టతల వస్తుంది. టెస్టోస్టెరోన్ మగవారిలో బోన్ స్ట్రెంత్ ని పెంచుతుంది.

bald head 1

అయితే.. కొంతమంది మగవాళ్లకు ఉండే కొన్ని అలవాట్ల వలన కూడా ఈ బట్టతల వస్తూ ఉంటుంది. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఎక్కువగా టోపీని వినియోగిస్తూ ఉంటారు. అసలు టోపీ లేకుండా బయటకు రావడానికి కూడా ఇష్టపడరు. ఇలా టోపీ ఎక్కువగా పెట్టుకోవడం వలన కూడా జుట్టుకు ఆక్సిజెన్ సరఫరా తగ్గి బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. తలస్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడు గట్టిగ దువ్వడం, టవల్ తో తుడవడం చేస్తుంటారు. దీనితో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయ్యి బట్టతల వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది.

bald head 2

అలాగే కొంతమంది రెగ్యులర్ గా హెడ్ బాత్ చేస్తూ షాంపూ చేసుకుంటూ ఉంటారు. వీరికి కూడా బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండు సార్ల కంటే ఎక్కువగా షాంపూ పెట్టకపోవడమే మంచిది. ఇక ధూమపానం, మద్యపానం వంటి హబిత్స్ వలన కూడా బోల్డ్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అలవాట్లు ఏమైనా ఉంటే.. మార్చుకోవడం మంచిది.


End of Article

You may also like