ఎవరు ఈ స్మృతి ఇరానీ..? టెలివిజన్ నుంచి రాజకీయాలలోకి ఎలా వచ్చారు..?

ఎవరు ఈ స్మృతి ఇరానీ..? టెలివిజన్ నుంచి రాజకీయాలలోకి ఎలా వచ్చారు..?

by kavitha

Ads

స్మృతి ఇరానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై కెరీర్ మొదలు పెట్టిన స్మృతి ఇరానీ, అక్కడ చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత రాజకీయాలలో అడుగుపెట్టి, తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.

Video Advertisement

తన తూటాల వంటి మాటలతో అపొజిషన్ పార్టీలను ఎదుర్కోవడంలో స్మృతి ఇరానీ టాప్‌లో ఉంటారు. తరచూ వార్తలలో నిలుస్తూ, ప్రజల మధ్యలో కనిపిస్తూ ఉంటారు. ఏ విషయం పై అయిన తనదైన శైలిలో మాట్లాడే స్మృతి ఇరానీ, బుల్లితెర నుండి పాలిటిక్స్ లోకి ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న స్మృతి అంత తేలికగా ఈ స్థాయికి రాలేదు. ఆమె లైఫ్ లో చాలా కష్టపడ్డారు. స్మృతి డిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకొచ్చి వివాహం చేసుకున్నారు. దక్షిణ దిల్లీ శివార్లలో నివసించేవారు. చేతిలో డబ్బు లేకపోవడంతో వారు పశువుల కొట్టాన్ని చూసుకునే పని చేసేవారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. పేదరికం వల్ల చదువుకుంటూనే కొన్ని బాధ్యతలు ఆమె మోయాల్సి వచ్చింది.పదవ తరగతి చదివేటప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేది. ఆ తరువాత ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఆర్థిక పరిస్థితులు వల్ల కాలేజీ మానేసి, దూరవిద్యలో చదవడం ప్రారంభించింది. తన ఫ్యామిలీ ఆర్ధికంగా సాయం చేయడానికి, ఢిల్లీలో బ్యూటీ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ టైమ్ లో ఫ్రెండ్ సలహాతో మిస్ ఇండియా పోటీలకు తన ఫోటోను పంపారు. 1998లో మిస్ ఇండియాకు ఎంపికయ్యారు. అయితే, ఆమె తండ్రి అందులో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. అయితే ఆమె తల్లి కష్టపడి డబ్బు సర్దుబాటు చేసి స్మృతిని ఆ పోటీకి పంపింది. స్మృతి ఫైనల్స్‌కు వెళ్ళిన ఆమె గెలవలేకపోయారు. ఆ డబ్బును తల్లికి ఇవ్వడం కోసం స్మృతి జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని రోజుల ఒక ప్రకటనలో ఛాన్స్ వచ్చింది. దాని ద్వారా టీవీలో రెండు మూవీ ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ ఛాన్స్ లభించింది. వీటిని చూసిన శోభా కపూర్ తన కుమార్తె ఏక్తా కపూర్ కు స్మృతిని పరిచయం చేసింది. అలా స్మృతికి ‘క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ’ అనే టెలివిజన్ సీరియల్ లో తులసి పాత్రకు సెలెక్ట్ అయ్యింది. ఆ సీరియల్ ఆమె లైఫ్ ని మలుపు తిప్పింది. 8 ఏళ్ళ పాటు స్మృతి ఆ సీరియల్ లో కనిపించింది. టీవీ యాక్టర్లకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అయిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఆమె వరసగా 5 సార్లు అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ తరువాత ఒక నిర్మాణ సంస్థ స్థాపించి పలు సీరియల్స్ నిర్మించింది. 2001లో పార్సీ బిజినెస్ మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకోవడంతో స్మృతి ఇరానీగా పాపులర్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్మృతి తాత ఆర్ఎస్ఎస్ లో పని చేసేవాడు. దాంతో స్మృతి చిన్నప్పటి నుంచే అందులో సభ్యురాలుగా ఉంది. నిర్మాతగా ఉన్నపుడే ఆమె రాజకీయాలలో అడుగుపెట్టింది. 2003లో బిజెపిలో జాయిన్ అయ్యింది. ఆ పార్టీలో వివిధ స్థాయిలలో పార్టీ కోసం కృషి చేసిన పనిచేసిన స్మృతి ఇరానీ 2014 లో మోది గవర్నమెంట్ లో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది. అప్పటి నుండి పలు శాఖలలో మంత్రిగా పనిచేశారు.

Also Read: యశస్విని రెడ్డి భర్త ఎవరో తెలుసా..? వీరి పెళ్లి ఎప్పుడు జరిగిందంటే..?


End of Article

You may also like