Dowry: వరకట్నంపై కేరళ ప్రభుత్వ సంచలన నిర్ణయం.!

Dowry: వరకట్నంపై కేరళ ప్రభుత్వ సంచలన నిర్ణయం.!

by Mohana Priya

Ads

వరకట్నంపై కేరళ ప్రభుత్వం సంచలన తీర్పు తీసుకుంది. కేరళ ప్రభుత్వంలో పనిచేస్తున్న పెళ్లి కానీ పురుష ఉద్యోగులు, వరకట్నాన్ని ప్రోత్సహించడం, లేదా తీసుకోవడం చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పెళ్లయిన నెల రోజుల్లో తాము పనిచేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ కూడా ఇవ్వాలి అని ఆదేశించింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.

Video Advertisement

Questions to ask before marriage

ఆ డిక్లరేషన్ లో భార్య సంతకంతో పాటు, భార్య తండ్రి, అలాగే అబ్బాయి తండ్రి సంతకాలు కూడా ఉండాలి అని పేర్కొంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కొద్ది రోజుల క్రితం ఈ సర్క్యులర్ ని జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, అటానమస్ అలాగే ఇతర సంస్థలకు చెందిన అధిపతులు కూడా ఈ డిక్లరేషన్లు తీసుకోవాలి అని సూచించింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 10, అక్టోబర్ 10వ తేదీకి ముందు ఈ డిక్లరేషన్లు జిల్లా వరకట్న నిరోధక శాఖ అధికారికి సమర్పించాలని చెప్పింది.

Questions to ask before marriage

వీటితో పాటు కేరళలో కూడా ప్రతి ఏడాది నవంబర్ 26వ తేదీన వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజు స్కూల్స్ లో, కాలేజీలలో, అలాగే ఇతర విద్యాసంస్థలలో విద్యార్థులు కట్నం తీసుకోము అని ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. గత నెలలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులు తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని చెప్పారు.


End of Article

You may also like