వీడు మామూలోడు కాదు… కలెక్టర్‌ కే షాక్ ఇచ్చాడు..! చివరికి గుట్టు ఎలా రట్టైందంటే.?

వీడు మామూలోడు కాదు… కలెక్టర్‌ కే షాక్ ఇచ్చాడు..! చివరికి గుట్టు ఎలా రట్టైందంటే.?

by Mohana Priya

Ads

సైబర్ నేరగాళ్ల ఆటలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాల క్రమేణా సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ… సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువగా పెరుగుతున్నాయి. గిఫ్ట్ వచ్చిందనే సాకుతో లింకులు పంపు. ఉద్యోగం ఇస్తాం అంటూ, లాటరీ డబ్బులు అంటూ ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ, సైబర్ నేరాల ఉచ్చులో పడేస్తున్నారు.

Video Advertisement

దీనికి హద్దు పద్దులు లేకుండా పోయాయి. ఎవరిని మోసం చేస్తున్నాము అనే ఆలోచన కూడా ఉండట్లేదు. దీనిపై ప్రభుత్వం ఎన్ని లీగల్ యాక్షన్ తీసుకున్నప్పటికీ… వీటిని అరిక్కట్ట లేకపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త పన్నాగంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ పేరుతో వల వేశారు.

సాక్షి కథనం ప్రకారం… యంగ్ ఏజ్ లోనే ఐఏఎస్ అధికారి అయిన టీనా దాబి, తన తోటి ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఒక సైబర్ నేరగాడు ఆఫీసర్ టీనా దాబి పేరుతో, తన ఫోటోనే వాట్స్ ఆప్ కి డీపీగా పెట్టుకుని అందరినీ మోసం చెయ్యడం మొదలు పెట్టాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కు సంబంధించి, గిఫ్ట్ కార్డులు పంపాలంటూ మేసేజులు పెట్టేవాడు. అందులో కొందరు నిజంగా ఆఫీసర్ టీనానే ఆ మేసెజులు పంపి ఉంటారు అనుకుని, వాటికి స్పందించేవారు.

ఇది చూసి తన ఆటలు బాగానే కొనసాతున్నాయని బ్రమ పడ్డాడు, ఆ సైబర్ నేరస్థుడు. అలానే ఒకరోజు తను పంపుతున్న అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మేసీజు అర్బ‌న్ ఇంప్రూవ్‌మెంట్ ట్ర‌స్టు సెక్ర‌ట‌రీ సునితా చౌద‌రీకి కూడా చేరింది. అక్కడే ఆ నేరస్థుడి ప్లాన్ బెడిసికొట్టింది. సెక్ర‌ట‌రీ సునితా చౌద‌రీకి అనుమానం రావడంతో, ఎందుకైనా మంచిది అని టీనాకు ఫోన్ చేశారు. దీంతో ఆఫీసర్ టీనా పసిగట్టి, వివరాలను సైబర్ పోలీసులు శోధించి విషయాన్ని చేదించారు. అక్కడితో నేరస్థుడు గుట్టు రట్టయింది. ఇదంతా రాజ‌స్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన ఓ యువ‌కుడు చేసిన పని అని తేలింది.


End of Article

You may also like