పుట్టింటి నుండి అత్తింటికి అస్సలు తీసుకెళ్లకూడని 9 వస్తువులు ఇవే.!

పుట్టింటి నుండి అత్తింటికి అస్సలు తీసుకెళ్లకూడని 9 వస్తువులు ఇవే.!

by Anudeep

Ads

పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితం లో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. పెళ్లి అయిన తరువాత నుంచి ప్రతి అమ్మాయికి రెండు కుటుంబాలను సమర్ధించుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. అత్తిల్లు, పుట్టిల్లు అని రెండు ఇళ్లలోనూ తన బాధ్యత నెరవేరుస్తుంది. అయితే.. ఈ క్రమం లో పుట్టింటివారు కూడా తమ కూతురు కు అనేకరకాల వస్తువులను ఇస్తూ ఉంటారు. కానీ.. కొన్ని వస్తువులు మాత్రం ఆడపిల్లలు పుట్టింటినుంచి అస్సలు తీసుకోకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

marriage

పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్న అమ్మాయి చేదు పదార్ధాలను కానీ, పుల్లటి పదార్ధాలను కానీ అస్సలు తీసుకెళ్లకూడదట. ఇలా పుల్లటి పదార్ధాలను తీసుకెళ్లడం వలన ఇరు కుటుంబాల మధ్యన మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుందట. అలాగే.. రెండు కుటుంబాల మధ్య అభిప్రాయభేదాలు వచ్చి గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

salt n broom

అలాగే చీపురు ని కూడా తీసుకెళ్లకూడదు. చీపురు లక్ష్మి దేవి స్వరూపం. పుట్టింటినుంచి అత్తింటికి వచ్చే అమ్మాయి చీపురును తెచ్చుకోవడం వలన లక్ష్మి దేవిని తీసుకెళ్లినట్లు అవుతుందట. అందుకే తీసుకెళ్లకూడదు అంటారు. ఉప్పు, చింతపండు, చింతకాయ పచ్చడి వంటివాటిని తీసుకెళ్లే సమయం లో ఊరికే తీసుకోవడం కాకుండా.. కొంత నగదు ని ఇచ్చి బదులుగా వీటిని తీసుకోవచ్చట.

pooja

నల్లటి వస్తువులను, వస్త్రాలను తీసుకోవడం కూడా అంత మంచిది కాదట. కొందరైతే తమ పుట్టింటినుంచి పూజ సామాగ్రిని గుర్తు గా తెచ్చుకుంటుంటారు. అయితే ఇలా కూడా చేయకూడదట. పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలోను పూజా సామాగ్రిని తెచ్చుకోకూడదట.


End of Article

You may also like