ఎండీహెచ్ మసాలా ప్యాకెట్ పై ఈ తాత గురించి తెలుసా? పాల వ్యాపారి నుంచి కోట్లకు అధిపతి అయ్యేదాకా..అతని కథ చదవాల్సిందే..!

ఎండీహెచ్ మసాలా ప్యాకెట్ పై ఈ తాత గురించి తెలుసా? పాల వ్యాపారి నుంచి కోట్లకు అధిపతి అయ్యేదాకా..అతని కథ చదవాల్సిందే..!

by Anudeep

Ads

భారతీయ వంటకాల్లో ఎండీహెచ్ మసాలా ప్రాముఖ్యత గురించి కొత్త గా చెప్పక్కర్లేదు. ఎండీహెచ్ ప్యాకెట్ పైన,యాడ్స్ లోను ఓ తాత కనిపిస్తూ ఉంటారు కదా.. ఆయన ఎవరా అని ఎపుడైనా ఆలోచించారా.. ?ఆయన పేరు మ‌హాశ‌య్ చున్నీ లాల్ గులాటి. ఈ కంపెనీ ని స్థాపించింది ఆయనే. మొదట్లో వీరి కుటుంబం పాకిస్తాన్ లో ఉండేది. అక్కడ వీరి తండ్రి వ్యాపారం చేసే వారు. బహుశా ఇంతటి వ్యాపార పరిజ్ఞానం ఆయనకు తండ్రివద్దనుంచే వచ్చి ఉంటుంది. గులాటి ఐదవతరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత చదువు మానేసి చిన్న గా వ్యాపారం చేయడం ప్రారంభించారు. పాకిస్థాన్, భారత్ దేశాలు విడిపోకమునుపు సియాల్ కోట్ ప్రాంతం లో ఎండీహెచ్ కంపెనీ ని పెట్టారు.

Video Advertisement

mdh masala powder

దానినే మహాషియన్ డి హట్టి అని కూడా పిలిచే వారు. ఈ కంపెనీ కోసం గులాటి చాలా కష్టాలు పడ్డారు. మొదట్లో ఇది చాలా చిన్న కంపెనీ. దానికి తోడు, పాకిస్థాన్, భారత్ లు విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయం లో అప్పటివరకు చేస్తున్న మసాలా వ్యాపారాన్ని వదిలేసి గులాటి కుటుంబం ఢిల్లీ కి వచ్చేసింది. ఢిల్లీ లో కి వచ్చేనాటికి గులాటి దగ్గర కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిలోనే 650 రూపాయలతో ఓ టాంగా కొని కిరాయి కి తిప్పేవారు. న్యూ ఢిల్లీ లో రైల్వే స్టేషన్ నుంచి కుతుబ్ రోడ్, బారా హిందు రావు వంటి ఏరియాలలో టాంగా తిప్పేవారు. అందుకు రెండు అణా లను తీసుకునేవారు. కొన్నేళ్ళకు నిలదొక్కుకున్నాక, సోదరునితో కలిసి తిరిగి పాకిస్తాన్ వదిలేసిన వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు.

gulati tanga

అయితే,. వారు తయారు చేసే మసాలా లో క్వాలిటీ ఉండడం తో నోటిమాట ద్వారానే వారికి ఎంతో పాపులారిటీ వచ్చింది. ఒకసారి కొన్న వారు మళ్ళీ మళ్ళీ వారివద్దకు వచ్చి కొనేవారు. అలా, ఆ కంపెనీ కోట్ల టర్న్ ఓవర్ కు చేరుకుంది. వ్యాపారం పుంజుకున్నాక ఈ ప్రోడక్ట్ యాడ్ లలో కూడా గులాటీనే నటించారు. సెలెబ్రిటీల కంటే తానూ నటిస్తేనే ప్రోడక్ట్ ను ఎవరు తయారుచేస్తున్నారో తెలుస్తుందని గులాటి విశ్వసించరు. అలానే, ఈ మసాలా తయారు చేయడానికి అవసరమైన దినుసులను కూడా ఆఫ్గనిస్తాన్, కర్ణాటక, కేరళ, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తయారు చేస్తారు.

క్రమం గా ఎండీహెచ్ మసాలా పొడి బ్రాండ్ గా స్థిరపడిపోయింది. వీటిని తయారు చేసాక టెస్ట్ చేయడానికి కూడా సొంతం గా ల్యాబ్ లు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే.. ఈ పొడి ఎపుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం అత్యధిక లాభాలను ఆర్జిస్తోంది ఈ కంపెనీ. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. 300 బెడ్స్ తో ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్య సేవను అందిస్తోంది. అలాగే, 200 స్కూళ్లను స్థాపించి ఉచిత విద్యను అందిస్తోంది. మానవత్వం కలిగిన మనుషులు విజయం సాధిస్తే ఎలా ఉంటుందో అన్న విషయం తెలపడానికి గులాటి గారి జీవితం ఒక ఉదాహరణ.


End of Article

You may also like