“వంట గది”లో తెలియకుండా చేసే ఈ 7 పొరపాట్లు… ప్రాణానికే హాని కలిగిస్తాయని తెలుసా..?

“వంట గది”లో తెలియకుండా చేసే ఈ 7 పొరపాట్లు… ప్రాణానికే హాని కలిగిస్తాయని తెలుసా..?

by Mohana Priya

Ads

మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో తయారుచేసే విధానం కూడా అంతే ముఖ్యం. ఆహారంలోని స్వచ్ఛత మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే దీనికి కారణం. కరోనా మహమ్మారి తర్వాత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే వంటింట్లో మనం అనుసరించే కొన్ని అలవాట్లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి.

Video Advertisement

శాకాహారం లేదా మాంసాహారం ఏదైనా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. వడ్డించే ముందు శుభ్రంగా ఉండండి. వంటగదిలో మనం చేసే చిన్నచిన్న తప్పుల వలన ఆహారం కలుషితం అవుతుంది. అందుకే కిచెన్ లో ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు అవేంటంటే..

#1. స్పాంజ్‌ల వాడకం:

స్పాంజ్‌ల వాడకం నెలల తరబడి ఒకే స్పాంజ్‌తో వంటగదిని శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఒకే స్పాంజ్‌ని ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మురికి కూరుకుపోయి కీటకాలు ఉత్పత్తి అవుతాయి. అవి మీ ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

#2. రీసైక్లింగ్ బ్యాగ్‌ లు:

రీసైక్లింగ్ బ్యాగ్‌లను ఉపయోగించడం మంచిది కాదు. మార్కెట్ నుంచి కూరగాయలు తేగానే వాటిని అందులో నుంచి తీయాలి. తిరిగి వాటిని ఉపయోగించకూడదు.

#3. కూరగాయలు లేదా మాంసాన్ని కడగడం:

kitchen

వంట చేయడానికి ముందు కడగాలి. కానీ మాంసం కడగడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం. మీరు సింక్‌లో కడిగినప్పుడు.. మాంసంలోని పదార్థాలు సింక్‌లో పడిపోతుంటాయి. అవి ఇతర కంటైనర్‌లకు అంటుకుంటాయి. మీరు చూడకుండా ఉంటే అది అలానే ఉండిపోతుంది. కాబట్టి మాంసం కడిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

#4. నూనె కిందపోతే వెంటనే శుభ్రం చేయాలి:

వంటగదిలో వంట నూనె కిందపోతే.. నూనెను 5 సెకన్లలోపు శుభ్రపరచాలి. అది అలాగే ఉంటే వంట గది మొత్తం వ్యాపిస్తుంది. అంతే కాదు మీరు జారి కింద కూడా పడిపోయే ప్రమాదం ఉంది.

#5. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టడం:

వండిన పదార్థాలు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ లో పెడితే బ్యాక్టీరియా పెరగదు.

#6. ఏ పదార్థం ఎన్ని రోజులు ఉంచాలి:

ఫ్రిడ్జ్ లో ఏ పదార్థం ఎన్ని రోజులు ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం. చేపలు మాంసం 3 రోజులు, సాసులు 20 నుంచి 30 రోజులు, తిన్నాక మిగిలినవి 1 లేదా 2 రోజులు, పండ్లు, కూరగాయలు 3 నుంచి 7 రోజులు, పాలు 2 నుంచి 5 రోజులు, బేకరీ, కేకులు 5 రోజులు, గుడ్లు 7 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచొచ్చు.

#7. ఫ్రిడ్జ్ ని శుభ్రం చేయడం:

ఫ్రిడ్జ్ ని తరచూ శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్ లో ఏవైనా కింద పడినప్పుడు వెంటనే శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్ ఎంత శుభ్రంగా ఉంటే అందులోని పదార్థాలు అంత శుభ్రంగా ఉంటాయి.


End of Article

You may also like