డాక్టర్ ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే… “మిథాలీ రాజ్” ఎందుకు వద్దనుకున్నారు..?

డాక్టర్ ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే… “మిథాలీ రాజ్” ఎందుకు వద్దనుకున్నారు..?

by Mohana Priya

Ads

క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నారు మిథాలీ రాజ్. పదహారేళ్ళ వయసులో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో మిథాలీ రాజ్ తన క్రికెట్ కెరీర్ మొదలు పెట్టారు. 2002లో ప్రపంచకప్ లో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నా కూడా అది లెక్క చేయకుండా టోర్నీలో పాల్గొన్నారు.

Video Advertisement

మిథాలీ రాజ్ కి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపిక అయ్యారు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసు ఉన్న భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ గుర్తింపు పొందారు. 23 సంవత్సరాల కెరీర్ లో వన్డేల్లో 7805, టీ20ల్లో 2364, టెస్టుల్లో 669 పరుగులు చేశారు.

mithali raj once got an opportunity to marry a doctor

ఇన్ని సంవత్సరాలు కెరీర్ని కొనసాగించిన మొదటి మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ గుర్తింపు సంపాదించారు. చిన్నప్పుడు మిథాలీ రాజ్ చాలా ఆలస్యంగా నిద్రలేచే వారు అని ,తన బద్దకాన్ని వదిలించడానికి మిథాలీ రాజ్ తండ్రి స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించారు. మిథాలీ రాజ్ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందారు. ఒకవేళ క్రికెటర్ అవ్వకపోతే ఉంటే సివిల్ సర్వీసెస్ రాసి దేశానికి సేవ చేసేవారు అని, అలాగే తన భరతనాట్యం కెరీర్ కూడా కొనసాగించేవారు అన్ని మిథాలీ రాజ్ చెప్పారు.

mithali raj once got an opportunity to marry a doctor

మిథాలీ రాజ్ వృత్తికి సంబంధించిన విషయాలు అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. మిథాలీ రాజ్ కెరీర్ ప్రారంభించిన తర్వాత అప్పటికి మహిళా క్రికెటర్లకు పెద్దగా ఆదాయం లేనప్పుడు, ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. కానీ వారు ఆటకి దూరంగా ఉండాలి అని షరతు పెట్టారు. దాంతో తన ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా మిథాలీ రాజ్ కెరీర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఒక ప్రముఖ క్రీడా ఛానల్ లో వ్యాఖ్యాత కోసం ఇంటర్వ్యూ కూడా వెళ్లారు. అన్ని పరీక్షల్లో పాస్ అయినా కూడా మోకాళ్ల పైవరకూ దుస్తులు వేసుకోవాలి అని చెప్పడంతో మిథాలీ రాజ్ తిరస్కరించారు.


End of Article

You may also like