20 వేలతో మొదలు పెట్టి.. 1000 కోట్లకు ఎదిగిన “రజిని”.! ఈమె సక్సెస్ స్టోరీ చదవాల్సిందే..!

20 వేలతో మొదలు పెట్టి.. 1000 కోట్లకు ఎదిగిన “రజిని”.! ఈమె సక్సెస్ స్టోరీ చదవాల్సిందే..!

by Anudeep

Ads

అందరిలోనూ టాలెంట్ ఉంటుంది. కానీ దానిని ముందు గా గుర్తించి సరైన విధం గా దారి ఏర్పాటు చేసుకున్నవారు జీవితం లో సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ ఓ మహిళ స్టోరీ ఇది. మిసెస్ బెక్టార్స్.. ఈ పేరు తెలుగు వారికి పెద్దగా తెలియకపోయినా.. నార్త్ ఇండియన్స్ లో ఈమె పేరు తెలీని వారుండరు. మిసెస్ బెక్టార్స్ పేరిట ఆమె విక్రయించే ఫుడ్స్ దాదాపు ప్రతి గడపను తాకుతాయి. ఆమె వ్యాపారం ప్రారంభించక మునుపు మొదట్లో రకరకాల వంటలు, ఐస్ క్రీమ్ లు చేసి తన సన్నిహితులకు పెట్టేవారు. వాటిని ఎలా ఉన్నాయో చెప్పాలని కోరేవారు. ఆమె ఏ వంటకం తయారు చేసినా, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది. దీనితో, ఆమె వ్యాపార రంగం లోకి వెళ్లాలని నిశ్చయించుకుంది.

Video Advertisement

అలా, ఇరవై వేలతో ఆమె వ్యాపారం ప్రారంభించింది. నేడు.. ఆమె సంస్థ టర్న్ ఓవర్ వెయ్యి కోట్ల పైమాటే. ఇటీవలే స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించి అక్కడ కూడా సత్తా చాటింది. స్టాక్ మార్కెట్ లో ఐపిఒ కు వచ్చి సుమారు రెండు వందల రెట్లు సబ్స్క్రయిబ్ అయిన సంస్థ గా మిసెస్ బెక్టార్స్ ఫుడ్స్ కంపెనీ రికార్డు సృష్టించింది. ఇటీవల కాలం లో ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్ భారత్ లో తమ మార్కెట్ ను విస్తరించుకుంటున్నాయి. ఈ పోటీ ని తట్టుకుంటూ కూడా మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ స్థిరం గా నిలబడింది. ఇతర కంపెనీలకు గట్టిపోటీ ఇస్తోంది. ఈ కంపెనీ ని స్థాపించిన అధినేత్రి రజని బెక్టార్ కరాచీ లో జన్మించారు.

దేశ విభజన సమయం లోనే కుటుంబం తో పాటు ఢిల్లీ కి వచ్చేసిన రజని బెక్టర్ పదిహేడేళ్ల వయసులోనే లూథియానా కు చెందిన ధరమ్ వీర్ బెక్టార్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆమె పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లిపోవడం తో ఏమి తోచేది కాదు. అలాంటి సమయం లోనే ఆమె ఫుడ్ తో ప్రయోగాలు చేసేవారు. అగ్రికల్చర్ వర్శిటీ నుంచి ఆమె కుకింగ్ కోర్స్ ను కూడా పూర్తి చేసారు. వ్యాపారం చేయాలనీ భావించారు.

మొదట్లో తెలిసిన వాళ్లకు తన వంటలను రుచి చూపించి మెల్లిగా వ్యాపారాన్ని విస్తరించారు. తొలుత, తక్కువ ధరలకే అమ్మేవారు. కొంతమేర నష్టాలను కూడా చవిచూశారు. కానీ సంతృప్తి లభించడం తో వ్యాపార రంగం లో అడుగు ముందుకేశారు. మొదట్లో ఐస్ క్రీం ల ఆర్డర్లను పెద్ద ఎత్తున తీసుకోవడం మొదలు పెట్టారు. ఆమె భర్త కూడా ఈ వ్యాపారాన్ని సీరియస్ గా తీసుకుని ఆమెకు అండగా నిలబడ్డారు. ఐస్క్రీమ్ లతో మొదలైన వ్యాపారాన్ని మెల్లగా బిస్కట్లకు, కుకీస్ కు కూడా విస్తరిస్తూ వచ్చారు.

 

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1990 ప్రాంతం లో భారత్ లోకి మెక్ డొనాల్డ్స్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే మిసెస్ బెక్టార్ ఫుడ్స్ తయారు చేసే క్రిమికా ఉత్పత్తులు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. మెక్ డొనాల్డ్స్ సైతం పూర్తి గా బెక్టర్ ఫుడ్స్ యొక్క క్రిమికా ఉత్పత్తులపై ఆధారపడింది. అలా, రజిని బెక్టార్ తన కంపెనీ నుంచి అంతర్జాతీయ సంస్థలతో సైతం డీల్స్ కుదుర్చుకోవడం ప్రారంభించారు.

2006 వ సంవత్సరం వచ్చే నాటికి, కంపెనీ టర్న్ ఓవర్ వంద కోట్లు దాటేసింది. అలా 2020 వచ్చేసరికి అంతకు పదిరెట్లు అంటే.. వేయి కోట్లకు చేరుకుంది. ఇపుడు స్టాక్ మార్కెట్ లో కూడా మిసెస్ బెక్టార్ కంపెనీ ఎన్నో విజయాలను సాధిస్తోంది. ఈ కంపెనీ ప్రతి విజయం లోను రజిని బెక్టార్ ఉన్నారు. ఈ ఘనత వెనక ఏదైనా చేసి తీరాల్సిందేనన్న స్ఫూర్తి ఆమె లో ఉంది.

 


End of Article

You may also like