ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్​ కార్ల్‌సెన్‌ పై ప్రజ్ఞా నంద విజయం..!

ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్​ కార్ల్‌సెన్‌ పై ప్రజ్ఞా నంద విజయం..!

by Megha Varna

Ads

వయసు చిన్నదైనా సాధించిన రికార్డు మాత్రం పెద్దదే. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞా నంద అద్భుతమైన రికార్డును సృష్టించాడు. ప్రత్యర్థిని ఓడించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ ను ఓడించాడు ప్రజ్ఞ నంద. మరిక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే..

Video Advertisement

ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ 8th రౌండ్ లో ప్రజ్ఞా నందా కార్ల్‌సెన్‌ ని ఓడించి నెగ్గాడు. కేవలం 39 ఎత్తుల్లోనే విజయాన్ని అందుకున్నాడు ఈ బాలుడు.

సోమవారం జరిగిన టర్రాష్ వేరియేషన్ గేమ్‌ లో ప్రజ్ఞా నందా బ్లాక్స్ ని ఎంచుకుని ఆట మొదలెట్టాడు. ఇంకేం వుంది 39 ఎత్తుల్లోనే మాగ్నస్‌ను ఓడేలా చేసాడు. ఈ బాలుడు వయసు కేవలం పదహారు ఏళ్ళు. అయితే ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ 8th రౌండ్ లో 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు.

దీనికి ముందు అనీష్ గిరి, క్వాంగ్ లీమ్ లేతో ఆడగా అవి డ్రా అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఎరిక్ హాన్సెన్, డింగ్ లిరెన్, జాన్-క్రిజ్‌స్టోఫ్ డుడా, షాఖ్రియార్ మామెద్యరోవ్ తో మాత్రం ఓడిపోయాడు ప్రజ్ఞ. అలానే కొన్ని నెలల ముంది కార్ల్‌సెన్ చేతిలో ఓడిన రష్యన్ ప్లేయర్ ఇయాన్ నెపోమ్నియాచి 19 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో వున్నాడు. డింగ్ లిరెన్, హాన్సెన్ ఇద్దరూ కూడా 15 పాయింట్ల తో ఉన్నారు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞా నంద మాత్రం 8 రౌండ్ల తర్వాత 12వ స్థానం లో నిలిచాడు.


End of Article

You may also like