ఎక్కువగా ఆవలిస్తున్నారా..? దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోండి..!

ఎక్కువగా ఆవలిస్తున్నారా..? దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోండి..!

by Megha Varna

Ads

ఒక్కొక్కసారి మనకు ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నిజానికి ఆవలింతలు రావడానికి వెనుక కారణాలు చాలా ఉన్నాయి. మన శరీరంలో జరిగే ప్రతీ మార్పుకు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో మైగ్రేన్ కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి దాని వలన చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Video Advertisement

headache types and reason

మైగ్రేన్ వలన వచ్చే సమస్యలు:

  • తాత్కాలికంగా దృష్టిని కోల్పోవడం
  • వికారంగా ఉండడం
  • అలసట
  • తిమ్మిరి ఎక్కడం
  • చిరాకుగా ఉండడం

మాట్లాడటం కష్టంగా ఉండడం ఇటువంటివన్నీ కూడా మైగ్రేన్ వలన మనం ఎదుర్కొంటూ ఉంటాము. పైగా మైగ్రేన్ లో చాలా రకాలు ఉన్నాయి ఏదిఏమైనా మైగ్రేన్ సమస్యను లైట్ తీసుకోకూడదు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

మైగ్రేన్ దశలు:

మైగ్రేన్ సమస్యలో వివిధ స్టేజెస్ ఉన్నాయి. మరి వాటి కోసం కూడా మనం చూసేద్దాం.

  • మొదటిదశలో తలనొప్పి ఎప్పుడైనా వస్తుంది.
  • రెండో దశలో ఇంద్రియాలు లో మార్పు ఉంటుంది.
  • మూడవ దశలో అయితే తలనొప్పి ఒక వైపు ఉంటుంది. త్వరగా అలసి పోవడం, పల్స్ రేట్ మారడం వంటివి కూడా ఈ స్టేజ్ లో ఉంటాయి.

ఆవలించడం కి మైగ్రేన్ కి సంబంధం ఏమిటి..?

మైగ్రేన్ సమస్య తో బాధ పడినప్పుడు ఆవలింతలు కూడా వస్తాయని.. విపరీతంగా ఆవలింతలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక ఎక్కువ ఆవలింతలు వస్తుంటే కూడా మైగ్రేన్ అని మీరు తెలుసుకోవచ్చు.

మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..?

#1. పగలు బాగా నిద్రగా కనిపించడం
#2. ఎక్కువ మత్తుగా ఉండడం
#3. అలసట ఎక్కువగా ఉండడం
#4. తలనొప్పి రావడం
#5. కండరాల నొప్పి కలగడం

మైగ్రేన్ నొప్పి ని ఎలా తగ్గించుకోవచ్చు..?

మందులు తీసుకొని మీరు తగ్గించుకోవచ్చు లేకపోతే జీవన విధానాన్ని మార్చుకోవచ్చు.
ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మానసిక ఒత్తిడికి గురవకుండా జాగ్రత్త పడడం వంటి వాటితో తగ్గించుకోవచ్చు.


End of Article

You may also like