ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు.పుష్ప సినిమా ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ లెవెల్లో తరికెక్కించడం జరుగుతుంది. మైత్రి మూవీస్ నిర్మాణ సారధ్యలో సుకుమార్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.
పార్ట్ వన్ క్రియేట్ చేసిన అంచనాలను అందుకునే విధంగా పార్ట్ 2 ని భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి కూడా తెలిసిందే.

ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో 40 ఏళ్ల హీరోయిన్ ని తీసుకుంటున్నారనే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడు చిత్రాలు వచ్చాయి. అవి మూడు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మొదటి సినిమా జులాయి, తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రాలతో వీరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బానర్స్ ఈ సినిమాని 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించనున్నారట.

పిరియాడిక్ మూవీగా దీని తరికెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన త్రిష హీరోయిన్ గా తీసుకొనున్నారని టాక్ వినపిస్తోంది. అల్లు అర్జున్ వయసు 41 సంవత్సరాలు, త్రిష వయసు 40 సంవత్సరాలు. కథ పరంగా త్రిష అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అయితే అల్లు అర్జున్ త్రిష కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుంది, ఫ్యాన్స్ ఎంతవరకు అంగీకరిస్తారు అనేది వేచి చూడాలి.త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Also Read:కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?




#2 వివి వినాయక్
#3 సురేందర్ రెడ్డి

సంజయ్ లీలా భన్సాలీ
డైరెక్టర్ అట్లీ
ఏఆర్ మురుగదాస్
కొరటాల శివ
డైరెక్టర్ త్రివిక్రమ్
బోయపాటి శ్రీను
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్‌కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్‌లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ డాన్స్ క్లిప్‌ను ఆడిటర్‌గా ఉన్న నటాలియా ఒడెగోవా అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళల డాన్స్ చేస్తుండగా, ఒక పాప వారిని అనుకరించి ఆకట్టుకుంది. బుధవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప-ది రైజ్ రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అల్లు అర్జున్ మరియు పుష్ప టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో పుష్ప ప్రీమియర్‌షోను ప్రదర్శించారు. దీనికి కథానాయకుడు అల్లు అర్జున్, నాయిక రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అంతే కాకుండా డిసెంబర్ 3న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో మరో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ మరియు అతని బృందం ఇటీవల దీనికి సంబంధించి విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్‌షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్చీ స్వెట్‌షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్‌షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.
అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్‌లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్‌ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

