మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కరలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి చెయ్యని పాత్ర లేదు, చూడని స్టార్ స్టేటస్ లో లేదు. ఇండియాలోనే మొదటిసారిగా కోటి రూపాయలు పారితోషకం అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని గుణం చిరంజీవిని చూసి నేర్చుకోవాలి అని అంటారు పెద్దలు. ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి చిన్న వారితో సైతం మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి ఏ అవసరం వచ్చిన ఆపద వచ్చిన ఆదుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎందరో సినీ కార్మికులు కడుపు నింపారు.

ఇలా ఏదో మంచి పని చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే చిరంజీవి తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.అసలు విషయానికి వెళ్తే చిరంజీవి పుట్టి పెరిగింది పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు అనే గ్రామం. చిన్నప్పటి తన విద్యభ్యాసం మొగల్తూరు పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సినీ హీరోయిన్ హైదరాబాదులో సెటిల్ అయినా కూడా చిరంజీవి ఎప్పటికప్పుడు మొగల్తూరు పైన తన ప్రేమను చూపిస్తూనే ఉంటారు. మొగల్తూరులో ఉండే తన స్నేహితులను కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

పుట్టినఊరు కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేసే చిరంజీవి గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాలు కూడా నిర్మించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.తన స్నేహితులకు ఆరోగ్యం బాగోలేదంటే వారి ఇంటికి వెళ్లి మరే చిరంజీవి పరామర్శించి వస్తారు. తాజాగా చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు మొగల్తూరు కి చెందిన పువ్వాడ రాజా అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అపోలో ఆసుపత్రికి వెళ్లి స్నేహితుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

అపోలో వైద్య బృందంతో మాట్లాడి తన స్నేహితుడికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. తన స్నేహితుడికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.ఇది చూసిన జనం అందరూ కూడా ఇది కదా చిరంజీవి అంటే అని మెచ్చుకుంటున్నారు. మనం ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పుడు మనతో నడిచిన వారిని గుర్తుపెట్టుకుని వారితో కలిసి ఉండడం నిజంగా అభినందించదగ్గ విషయం.
Also Read:హఠాత్తుగా నేను చనిపోతే…అందుకే పిల్లలకి ముందే ఇలా? కంటతడి పెట్టిస్తున్న సుమ మాటలు…!






 టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.
టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.












