ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్ ) సీజన్ 15 లో ముంబై ఇండియన్ పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గురువారం జరిగినటువంటి ఉత్కంఠ పోరులో ముంబై జట్టు మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగా, చేదనలో ముంబై జట్టు చివరి బంతి వరకు ఆడి ఏడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి విజయం సాధించింది.
చివరి ఓవర్లో ఆఖరి నాలుగు బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన చెన్నై జట్టు.. ధోని 6,4,2,4 పరుగులు చేసి గెలిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైపై చెన్నై బౌలర్లు చెలరేగి పోయారు. ముఖేష్ చౌదరి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై పవర్ ప్లే లో మూడు వికెట్లను కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే లో చెన్నై మూడు వికెట్లు పడగొట్టడం అది వరుసగా మూడోసారి.
సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ(51), షో కిన్(25) బ్యాటింగ్ లో అదరగొట్టారు. పొలార్డ్ (14), సామ్స్ (5),ఉన్నాడ్గట్ (19) చివర్లో మెరిశాడు. అంతకు ముందు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో పవర్ ప్లే ద్వారా ఒక వికెట్ మాత్రమే తీసిన చెన్నై గత మూడు మ్యాచుల్లో విజృంభిస్తోంది. చేధనలో చెన్నై జట్టు గైక్వాడ్ (0) గోల్డెన్ డక్ అయ్యాడు. ఉతప్ప (30), రాయుడు (40)కి తోడుగా చివర్లో ధోని (28 నాటౌట్ : 13 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్లు ) చేసి రాణించాడు.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16