నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేశారు. అయితే ఇదే వీడియోలో కనిపించిన రాజీవ్ కనకాల పై మీమ్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
వీరసింహారెడ్డి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్ టీజర్ ఇతర ప్రత్యేకమైన పోస్టర్లకు మంచి స్పందన లభించింది.ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.
ఈ సాంగ్ లో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. పాట హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగుతుంది. ఈ పాటతో బాలయ్య అభిమానుల సంతోషం పడుతున్నారు. లీడర్ గా వైట్ అండ్ వైట్లో బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటున్నారు.ముఖ్యంగా ఈ పాటకు సంగీతాన్ని అందించిన తమన్ కూడా ఈ వీడియోలో బాగానే ఆకట్టుకున్నారు.అయితే ఇదే వీడియోలో కనిపించిన రాజీవ్ కనకాల పై మీమ్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
రాజీవ్ కనకాల జై బాలయ్య వీడియోలో కనిపించడంతో రకరకాల మీమ్స్ నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. ఎందుకంటే రాజీవ్ నటించిన చాలా సినిమాలలో పాట అవగానే ఫైట్ సీన్లలో విలన్ ఆ పాత్రను చంపడం గాని, మరేదైనా కారణంతో అతని పాత్ర ఆ సినిమాలో ముగిసిపోతుంది. ఆ పాత్రని చంపడానికే పెడుతారా అన్నంతగా రాజీవ్ కనకాల పై మీమ్స్ పెడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు వీరసింహారెడ్డిని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు.ఇందులో కన్నడ నటుడు విజయ్ దునియా విలన్ గా నటిస్తూ ఉన్నారు.అంతేకాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కూడా ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.