Seethakka: ఒకప్పుడు తుపాకీ పట్టారు…ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం.! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

Seethakka: ఒకప్పుడు తుపాకీ పట్టారు…ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం.! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

by Harika

Ads

అనసూయ అలియాస్ సీతక్క.. తెలంగాణ ఎన్నికల తర్వాత మారుమోగుతున్న పేరు. ఏదో వారసత్వంతో ఎన్నికల్లో గెలిచి ఉన్నా లేక మామూలు వ్యక్తిగా పోటీ చేసి గెలిచి ఉన్న ఇంత డిస్కషన్ వచ్చేది కాదు కానీ ఒక మావోయిస్టుగా ఉండి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసి ఇప్పుడు తనని తాను నిరూపించుకొని ఎమ్మెల్యేగా ఎన్నిక అయి ఏకంగా మంత్రి కావడంతో.. ఈమె గురించి చర్చ జరుగుతోంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక మహిళ మావోయిస్టు నుంచి మంత్రి వరకు ప్రయాణించడం అంటే మాటలు కాదు కదా. నీతిగా ధర్మం కోసం పోరాడే వాళ్లకు ఎప్పుడూ అపజయం ఉండదు అన్నదానికి సీతక్కలాంటి వాళ్ళ జీవితం ఒక గొప్ప ఉదాహరణ.

Video Advertisement

public response for seethakka oath

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు సహ మంత్రులు అంతా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. “రేవంత్ రెడ్డి అనే నేను” అని అనడంతో ఎల్పీ స్టేడియం మొత్తం మోత మోగిపోయింది. తర్వాత కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎనిమిదవ మంత్రిగా సీతక్క వచ్చారు. సీతక్కని చూసిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొట్టారు. సీతక్క అందరికీ అభివాదం చేశారు.

public response for seethakka oath

ఆ తరువాత గవర్నర్ తమిళిసై వచ్చి, “తమిళిసై అనే నేను” అని అన్నా కూడా అక్కడ ప్రజల అరుపులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో సీతక్క మళ్ళీ వచ్చి అభివాదం చేశారు. అప్పటికే ఆలస్యం అవుతుండడంతో గవర్నర్ జోక్యం చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలి అన్నట్టుగా సైగ చేశారు. దాంతో సీతక్క వచ్చి, “దనసరి అనసూయ సీతక్క అనే నేను” అన్నారు.

ఇలా చెప్పిన తర్వాత అంతా అరుపులతో హోరెత్తిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి కంటే, సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రజల అరుపులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇది చూసిన వారు అందరూ కూడా, “బాహుబలి రేంజ్ లో సీతక్కకి అభిమానులు ఉన్నారు. సీతక్క ప్రమాణస్వీకారం చూస్తూ ఉంటే బాహుబలి సినిమాలో అమరేంద్ర “బాహుబలి అనే నేను” అంటూ ప్రభాస్ చేసే సీన్ గుర్తొచ్చింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

అయితే ఎవరు ఈ సీతక్క…ఎందుకు ఆమెకి అంత క్రేజ్ అంటే….1971 జూలై 9 లో ములుగు జిల్లా జగ్గన్నపేటలో దనసరి అనసూయ అలియాస్ సీతక్క జన్మించారు. ఆదివాసీ కోయ తెగ కుటుంబంలో జన్మించిన సీతక్క పదవ తరగతి చదువుతున్నప్పుడే అడవి బాట పట్టారు. పూలన్ దేవి రచనల ప్రభావంతో అడవి అండగా ఉంటుంది తుపాకీ పడితేనే అరాచకాలను అరికట్టచ్చు నమ్మి 1988లో నక్సల్ పార్టీలో చేరి సీతక్కగా మారారు. ఆ తర్వాత నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు సీతక్క. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. దాదాపు 15 ఏళ్లు అడవిలోనే గడిపిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో టీడీపీ హయాంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు సీతక్క.

అన్యాయం మీద పోరాడేందుకు 2001లో LLB చదివి సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొన్నారు. జనం మెచ్చిన నాయకురాలుగా ఆమె పేరు తెచ్చుకోవడంతో 2004 ఎన్నికల్లో టిడిపి ఆమెకు ములుగు టికెట్‌ కూడా ఇచ్చారు. అలా తొలిసారి 2004లో మొదటిసారి టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009లో టిడిపి తరఫున తొలిసారి శాసనసభలోకి ఎంట్రీ ఇచ్చారు.

మళ్లీ తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఆమె తన దృష్టి కేవలం రాజకీయంపైనే పెట్టలేదు.. కరోనాతో బాధపడుతున్న గిరిజనులకు అండగా నిలబడింది. ఆమె చేసే సేవ చూసి అందరూ.. తమ చుట్టూ ఉన్నవాళ్లలో సీతక్క లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటే బాగున్ను అని భావించేవారు. మైళ్ళ దూరం అడవిలోకి నడిచి వెళ్లి.. కరోనా సమయంలో మందులు, ఆహారం నిత్యవసరాలు గిరిజనులకు అందించి చేయూతగా నిలబడింది. “ఒకప్పుడు నా చేతిలో తుపాకీ ఉండేది, ఇప్పుడు బియ్యం, కూరగాయలు ఉంటున్నాయని ఆమె ఆనందంగా చెబుతున్నారు.” అని సీతక్క అన్న మాట తన గొప్పతనానికి నిదర్శనం.

ములుగు నియోజకవర్గం అంటే పూర్తిగా ఏజన్సి ప్రాంతం, దట్టమైన అడవులు, గిరిజన తెగలు.. రోడ్డు మార్గం కూడా కరువైన ప్రాంతాలు..అలాంటి ప్రాంతాల్లో కాలినడకనైనా ప్రయాణిస్తూ అక్కడి ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించి వ్యక్తి గత శుబ్రత తదితర విషయాలను గిరిజనులకి వివరించి, వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందించారు సీతక్క.

ఇక ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై 33,700 మెజార్టీతో విజయం సాధించారు. ఒక గిరిజన వర్గానికి చెందిన మహిళ తొలిసారి మంత్రివర్గ ప్రమాణంకు శ్రీకారం చుట్టింది.  టీడీపీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డి గారితో సీతక్క పరిచయం. సొంత అన్నాచెల్లెలాగే ఉండేవారు ఇద్దరు. ఈ విషయాన్ని పలువేదికలపై స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. 2023 ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు నుండే మొదలుపెట్టారు. ఈ రోజు సీతక్క గిరిజన శాఖ మంత్రిగా నియమించబడడం ప్రతి తెలుగువారికి గర్వకారణం.


End of Article

You may also like