“విశ్వక్ సేన్” పై “తమ్మారెడ్డి భరద్వాజ ” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“విశ్వక్ సేన్” పై “తమ్మారెడ్డి భరద్వాజ ” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Anudeep

Ads

గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ ల మధ్య జరుగుతున్న వివాదం అందరికి తెలిసిందే. అర్జున్ డైరక్షన్ లో సినిమా ఒప్పుకున్న విశ్వక్ సినిమా షూటింగ్ పెట్టుకుంటే మొదటి షెడ్యూల్ రాకుండా క్యాన్సిల్ చేశాడని మధ్యలో ఫోన్ లు కూడా ఎత్తలేదని.లేటెస్ట్ గా ఒక షెడ్యూల్ చేస్తే నైట్ వరకు బాగానే ఉన్నా షూటింగ్ రోజు రావడం కుదరదని చెప్పరని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

Video Advertisement

 

‘సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, ఇష్టం లేకుండా నాలుగు రోజులు చేసి ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడాను. అర్జున్‌గారికి అంత గౌరవం ఇచ్చా.’ అంటూ విశ్వక్ సేన్ కూడా దానిపై స్పందించారు. ఈ సినిమాని సొంతంగా అర్జున్ నిర్మిస్తుండగా.. హీరోయిన్‌గా అతని కూతురు ఐశ్వర్య నటిస్తున్నారు.

Tmmareddy bharadwaja comments on vishwaksen-arjun issue..

మరోవైపు ఈ వివాదం పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ” సినిమా ఒప్పుకొనే ముందే అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఒకసారి షూటింగ్ మొదలు పెట్టాక మార్పులు చేయమనడం సమంజసం కాదు. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను బాలకృష్ణగారిలోనూ చూసా.

Tmmareddy bharadwaja comments on vishwaksen-arjun issue..

కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు, విష్వక్ సేన్ కొంతవరకూ షూట్ చేసి ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా చెబుతున్నాడు. అర్జున్ కి దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉందన్నారు తమ్మారెడ్డి. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుంటే విష్వక్ ముందుగానే మనుకోవాల్సింది. ఈ సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా?..

Tmmareddy bharadwaja comments on vishwaksen-arjun issue..
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయి. ఫంక్షన్స్ లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విష్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు .. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ .. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే” అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.


End of Article

You may also like