“షా మాస్ ఇన్నింగ్స్” అంటూ… KKR vs DC మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“షా మాస్ ఇన్నింగ్స్” అంటూ… KKR vs DC మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకి మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ ని శుభమన్ గిల్ (43: 38 బంతుల్లో 3×4, 1×6) తో కలిసి ప్రారంభించిన ఓపెనర్ నితీశ్ రాణా (15: 12 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్ 4 వ ఓవర్‌ లో వికెట్ చేజార్చుకున్నారు.

Video Advertisement

trending memes on dc winning over kkr

తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (19: 17 బంతుల్లో 2×4) స్లో బ్యాటింగ్‌ తో నిరాశపరచగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0), సునీల్ నరైన్ (0) స్కోర్ చేశారు. మిడిల్ ఓవర్లలో దినేశ్ కార్తీక్ (14: 10 బంతుల్లో 1×4, 1×6) తో కలిసి కోల్‌కతా ఇన్నింగ్స్‌ ని ముందుకు నడిపించారు ఆండ్రీ రసెల్ (45 నాటౌట్: 27 బంతుల్లో 2×4, 4×6). చివరిలో పాట్ కమిన్స్ (11: 13 బంతుల్లో 1×4)తో కలిసి ఆండ్రీ రసెల్ భారీ షాట్ ఆడారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 154 పరుగుల స్కోర్ చేసింది.

155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (82: 41 బంతుల్లో 11×4, 3×6) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన శివమ్ మావీ బౌలింగ్‌ లో పృథ్వీ షా వరుసగా ఆరు బంతుల్నీ బౌండరీకి తరలించారు. ఇంకొక ఓపెనర్ శిఖర్ ధావన్ (46: 47 బంతుల్లో 4×4, 1×6) స్కోర్ చేశారు. పృథ్వీ షా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ అందుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16.3 ఓవర్లలో 156 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ఈ మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

#19


End of Article

You may also like