త్రివిక్రమ్ సినిమాల్లో “హీరోయిన్స్” ఇంత తింగరిగా ఎందుకు ఉంటారు..? దీనిపై త్రివిక్రమ్ ఏమన్నారంటే..?

త్రివిక్రమ్ సినిమాల్లో “హీరోయిన్స్” ఇంత తింగరిగా ఎందుకు ఉంటారు..? దీనిపై త్రివిక్రమ్ ఏమన్నారంటే..?

by Mohana Priya

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి మాటల మాంత్రికుడు. సినిమా మాటల రచయితగా, కథా రచయితగా దర్శకుడిగా ఎన్నో సినిమాలను రూపుదిద్దాడు. 1999లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశాడు.

Video Advertisement

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించారు. అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమా మంచి విజయం సాధించింది. బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డును, బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అసలు విషయం ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో హేమంత్ కుమార్ సి.ఆర్,  త్రివిక్రమ్ ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దానికి త్రివిక్రమ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే, “చాలా మంది వ్యక్తులు మీ చిత్రం గురించి ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు. అదేంటంటే మీరు తీసే నువ్వే నువ్వే చిత్రం నుంచి అఆ, అరవింద్ సమేత ఆ వరకూ మీరు ఫిమేల్ క్యారెక్టర్స్ కొంచెం అమాయకంగా చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటి?” అని అడిగారు. ఈ ప్రశ్నకు గానూ త్రివిక్రమ్ గారు, “బహుశా నేను పెరిగిన వాతావరణం గానీ, చూసిన ఆడవాళ్ళు కానీ కావచ్చు.  ప్రస్తుత జీవన విధానం మార్పుల బట్టి మనం ఒక శక్తివంతమైన మహిళను కోరుకుంటున్నాం.”

“ఒకానొక కాలంలో చాలా సంవత్సరాలకు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మరణించింది. మళ్ళి ఒక వంద సంవత్సరాల తర్వాత ఒక రుద్రమదేవి మరణించింది. వీరు తమ శక్తివంత రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన స్త్రీలు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు, ప్రేమించిన అమ్మాయి ల పైన యాసిడ్ పోయడం, చంపేయడం వంటివి బయట జరుగుతున్నాయి. నేను పెరిగిన వాతావరణంలో గాని, నా చుట్టుపక్కల ఉన్న నా అక్క చెల్లెలు గాని, ఆడవారిని గాని ఇంత భయంకరమైన పరిస్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎప్పుడు ఏ అమ్మాయిని ఏడిపించలేదు. ”

“ఒకవేళ వాళ్ళు పైన జోక్స్ వేసిన నవ్వుకుని ఎంజాయ్ చేసే విధంగానే ఉండేవావే కానీ, వాళ్ళ బాధ పెట్టే విధంగా మాత్రం ఉండేవి కాదు. నేను చూసిన పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు అమాయకంగా, తండ్రి చాటు బిడ్డ లాగా ఉండటమే నాకు కనిపిస్తుంది. అదే విధంగా నేను నా సినిమాలో లేడీ క్యారెక్టర్ ని రూపొందిస్తున్నాను. మారుతున్న ప్రపంచంతో పాటూ నేను కూడా మారుతున్నానేమో. అందుకే ఇప్పుడు ఇలా రూపొందిస్తున్నానేమో. బహుశా ఇది నా యుటోపియన్ వరల్డ్ (ఆదర్శవంతమైన ప్రపంచం) అయ్యుండచ్చు ఏమో.. ఇప్పట్లో ఇలా ఎవరు లేరు. డిస్టోపియన్ (ఎక్కువగా ఇబ్బంది పడే ప్రపంచం) లాగానే ఉన్నారు” అని ఆసక్తి కరమైన సమాధానమిచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్

Also Watch this video :

 


End of Article

You may also like